Supriya Yarlagadda : అప్పుడు హీరోయిన్, ఇప్పుడు ప్రొడ్యూసర్.. పవన్ పక్కన ఉన్న ఈమె ఎవరో తెలుసా? తెలుగు సినీ నిర్మాతలు నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటి అయిన విషయం తెలిసిందే. ఈ భేటీలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' హీరోయిన్ సుప్రియ కూడా పాల్గొంది. ఈ సందర్భంగా పవన్ తో కలిసి ఆమె దిగిన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. By Anil Kumar 24 Jun 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Actress And Producer Supriya Meets Pawan Kalyan : తెలుగు సినీ నిర్మాతలు నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటి అయ్యారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఇందుకు సంబంధించిన సమావేశం జరిగింది. ఇక కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు తెలుగు సినీ నిర్మాతలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమవేశంలో తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కాగా ఈ భేటీలో అశ్వినీదత్ (Aswani Dutt), అల్లు అరవింద్ (Allu Aravind), దిల్ రాజు (Dil Raju) వంటి అగ్ర నిర్మాతలతో పాటూ పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ హీరోయిన్ సుప్రియ కూడా పాల్గొంది. ఈ సందర్భంగా పవన్ తో కలిసి ఆమె దిగిన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. Also Read : షారుఖ్ సినిమాలో సమంత.. అసలు క్లారిటీ ఇదే! పవన్ కళ్యాణ్ టాలీవుడ్ కు 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' (Akkada Ammayi Ikkada Abbayi) అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈవీవీ (EVV) సత్యనారాయణ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో పవన్ సరసన సుప్రియ హీరొయిన్ గా నటించింది. అక్కినేని ఫ్యామిలీకి చెందిన ఈమె.. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ సంస్థలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తోంది. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ తో జరిగిన ప్రొడ్యూసర్స్ మీటింగ్ లో సుప్రియ సైతం పాల్గొంది. ఈ సందర్భంగా పవన్ తో ఆమె దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. #pawan-kalyan #actress-supriya-yarlagadda మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి