Paris Olympics 2024: క్రమశిక్షణా ఉల్లంఘన చర్యల కింద మరో క్రీడాకారిణి పై ఐఓఏ వేటు! ఒలింపిక్స్ 2024లో భారత రెజ్లరకు కష్టాలు తగ్గేలా కనిపించడం లేదు. వినేశ్ ఫోగట్ అనర్హత తర్వాత.. ఒలింపిక్ విలేజ్‌కు భారత రెజ్లర్ యాంటిమ్ పంఘల్ అక్రడిటేషన్ ని కూడా ఐఓఏ రద్దు చేసింది. వెంటనే పారిస్ వదిలి వెళ్ళమని నిర్వహకులు ఆదేశించారు. By Bhavana 08 Aug 2024 in ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Wrestler Antim Panghal: ఒలింపిక్స్ 2024లో భారత రెజ్లరకు కష్టాలు తగ్గేలా కనిపించడం లేదు. వినేశ్ ఫోగట్ అనర్హత తర్వాత.. ఒలింపిక్ విలేజ్‌కు భారత రెజ్లర్ యాంటిమ్ పంఘల్ అక్రడిటేషన్ ని కూడా ఐఓఏ రద్దు చేసింది. వెంటనే పారిస్ వదిలి వెళ్ళమని నిర్వహకులు ఆదేశించారు. దీనికి గల కారణాన్ని వారు వెల్లడించారు. ఆమె సోదరి, క్యాంపస్‌లోకి ప్రవేశించడానికి తప్పుడు అక్రిడిటేషన్ కార్డును ఉపయోగించిందని ఐఓఏ సిబ్బంది తెలిపారు. భద్రతా అధికారులు ఆమెను పట్టుకున్నారు. సోదరి నిషా పంఘల్‌ను ఆమె చేసిన నేరానికి పారిస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే భారత ఒలింపిక్ సంఘం జోక్యంతో ఈ హెచ్చరికను విడుదల చేశారు. ఈ సంఘటన తర్వాత ఐఓఏ.. క్రీడాకారిణి, ఆమె కోచ్, సోదరుడు, సోదరితో పాటు పారిస్ వదిలి వెళ్లాలని ఆదేశించింది. చివరికి పంఘల్ తన వ్యక్తిగత కోచ్, స్పారింగ్ భాగస్వామిని కలవడానికి వెళ్ళింది. ఆమె తన సోదరి నిషాను పారిస్ గేమ్స్ విలేజ్ నుంచి తన లగేజీని తీసుకెళ్లడానికి అక్రిడిటేషన్‌ను ఉపయోగించమని కోరింది.మహిళల ఫ్రీస్టైల్ 53 కేజీల తొలి రౌండ్‌లో పంఘల్ తొలి మ్యాచ్ లో 0-10తో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఫైనల్ మ్యాచ్ టర్కియేకు చెందిన యెనెప్ యెట్‌గిల్‌తో జరిగింది. Also Read: కావాలనే తొక్కేశారు.. కానీ గెలుపు ఆమెదే.. వినేశ్ ఓ సంచలనం #paris-olympics-2024 #antim-pangal మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి