Vastu Tips: వాస్తు చిట్కాలు చాలా ప్రభావవంతంగా పరిగణించబడతాయి. మీ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం, ఖర్చులు పెరిగినట్లైతే ఇంట్లో ప్రతికూల శక్తి ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. చాలా సార్లు మనకు తెలియకుండానే వాస్తు దోషాలకు కారణమయ్యే కొన్ని తప్పులు చేస్తుంటాం. అయితే వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారంలో కొన్ని వస్తువులను ఉంచడం ఇంట్లో పేదరికానికి కారణమవుతుందని నమ్ముతారు. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి..
ప్రధాన ద్వారానికి సంబంధించిన వాస్తు నియమాలు
- ఇంటి ప్రధాన ద్వారం వద్ద బూట్లు మరియు చెప్పులు ఎప్పుడూ ఉంచకూడదు. అదే సమయంలో, బూట్లు , చెప్పులు ఎల్లప్పుడూ దక్షిణ లేదా పశ్చిమ దిశలో వదలాలి. ఇలా చేయకపోతే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుంది.
- ప్రధాన ద్వారం ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. దాని కింద చెత్త పేరుకుపోకుండా జాగ్రత్త వహించాలి.
- ఇంటి ప్రధాన ద్వారం ముందు స్తంభం ఉంటే, దానిపై అద్దం ఉంచడం ద్వారా ప్రతికూల శక్తిని నివారించవచ్చు.
- మీ మెయిన్ డోర్ నుంచి ఎలాంటి శబ్దం రాకూడదని గుర్తుంచుకోండి. ఏదైనా శబ్దం ఉంటే, నూనె రాసి మరమ్మతు చేయండి.
- ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఎప్పుడూ చీకటి ఉండకూడదు. మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద మంచి కాంతి వచ్చేలా చాలా జాగ్రత్తగా ఉండండి.
- ఇంటి మెయిన్ డోర్ పక్కన వేరే తలుపులు ఉండకూడదు. మీ మెయిన్ డోర్ కు ఎదురుగా వంటగది ఉంటే, ప్రతికూల శక్తిని నివారించడానికి ఇంటి ప్రధాన తలుపు వద్ద క్రిస్టల్ బాల్‌ను వేలాడదీయండి.
- ఇంటి ప్రధాన ద్వారం చుట్టూ పుస్తకాల అరను ఉంచడం శుభప్రదమని చెబుతారు. కానీ దానిని ఇంటి ప్రధాన ద్వారం ముందు పుస్తకాలను ఉంచకూడదని గుర్తుంచుకోండి. ఈ వాస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారా ఇంట్లో పేదరికం, ప్రతికూల శక్తి తొలగిపోతాయని విశ్వాసం.
Also Read: Chilled Beer: చల్లటి బీర్ ఎందుకు టేస్టీగా ఉంటుంది..? పరిశోధనలో తేలిన నిజాలు..!