INDIA కూటమి అభ్యర్థిగా మల్లికార్జున్ ఖర్గే పేరును దాదాపు ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. కూటమి సమావేశంలో పీఎం అభ్యర్థిగా ఖర్గే పేరును పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీతో పాటు కేజ్రీవాల్ సైతం ప్రతిపాదించారు. దీనికి ఎలాంటి వ్యతిరేకత లేదని MDMK (మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం) MP వైకో తెలిపారు.
దేశ రాజధానిలో జరిగిన INDIA కూటమి పార్టీల సమావేశంలో మమతబెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన పదవికి అనుభవజ్ఞుడు(ఖర్గే) తగిన అభ్యర్థి కాగలరని అభిప్రాయపడ్డారు. అయితే వచ్చే ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన తర్వాత కూడా ఈ నిర్ణయం తీసుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. సమావేశం తరువాత మల్లికార్జున్ ఖర్గే కూడా రిపోర్టర్లతో మాట్లాడారు. దేశంలోని 28 రాజకీయ పార్టీల నాయకుల అలయన్స్ నాల్గవసారి సమావేశానికి వచ్చారని చెప్పారు. ఇక ప్రధాని విషయంపై ఖర్గేని ప్రశ్నించగా.. 'ముందు గెలుద్దాం, ప్రధానమంత్రి ముఖం ఎవరన్నది తర్వాత చర్చిస్తాం' అని చెప్పినట్టు సమాచారం. ఇక ప్రతిపక్ష కూటమి 2024 లోక్‌సభ ఎన్నికల కోసం జనవరి 30న ఉమ్మడి ప్రచారాన్ని ప్రారంభించనుందని సమాచారం.
ఆందోలనకు పిలుపు:
2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇండియా కూటమి భేటి అయ్యింది. ఢిల్లీలోని అశోకా హోటల్‌లో సమావేశమైన ఇండియా కూటమి పార్టీలు మీటింగ్ పెట్టారు.ఈ భేటికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ హాజరయ్యారు. బీహార్ సీఎం నితీశ్‌కుమార్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవరా్, సుప్రియ సూలే, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, -- ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, శివసేన (ఉద్ధవ్) ఉద్ధవ్ ఠాక్రే కూడా హాజరయ్యారు. ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే పేరును పేరును మొదట మమతా బెనర్జీ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను కేజ్రీవాల్ సమర్ధించారు. అయితే ఈ విషయంపై ఫైనల్ డిసిషన్ తర్వాత తీసుకుందామని మిగిలిన నేతల సూచించినట్టు సమాచారం. ఇక ఎంపీల సస్పెండ్‌పై దేశ వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది ప్రతిపక్షాల కూటమి. ఈ నెల 22న దేశ వ్యాప్తంగా ఆందోళన చేయాలని నిర్ణయించింది.
Also Read: వామ్మో..! ఎంతకు తెగించార్రా? మా వార్నర్ అన్ననే బ్లాక్ చేస్తారా?