/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/breaking.png)
ఫైబర్ నెట్ కేసులో విజయవాడలోని ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏడుగురు నిందితులకు చెందిన రూ.114 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేయాలని సీఐడీని ఆదేశించింది. రూ.114 కోట్లు రూపాయల విలువ చేసే ఆస్తులను అటాచ్ చేసే ఆదేశాలు ఇవ్వాలంటూ ఎసీబీ కోర్టులో ఇటీవల సీఐడీ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై విచారణ చేసిన ఏసీబీ కోర్టు ఆస్తుల అటాచ్ మెంట్ కు అనుమతి ఇచ్చింది. టెరా సాప్ట్ ఎండీ వేమూరి హరిప్రసాద్, ఇతర కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులు ఏడు ప్రాంతాల్లో ఉన్నట్లు సీఐడీ అధికారులు తెలిపారు.
ఈ వార్త అప్డేట్ అవుతోంది..