Chandrababu Arrest: చంద్రబాబుకు రిమాండ్ పొడగింపు.. ఎన్నిరోజులంటే.. ఏసీబీ కోర్టు కీలక తీర్పునిచ్చింది. చంద్రబాబుకు రిమాండ్‌ను మరో రెండు రోజులు పొడిగించింది. మరో రెండు రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలోనే ఉంటారంటూ కోర్టు జడ్జి ప్రకటించారు. By Shiva.K 22 Sep 2023 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Chandrababu Arrest Updates: ఏసీబీ కోర్టు కీలక తీర్పునిచ్చింది. చంద్రబాబుకు రిమాండ్‌ను మరో రెండు రోజులు పొడిగించింది. మరో రెండు రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలోనే ఉంటారంటూ కోర్టు జడ్జి ప్రకటించారు. అయితే, చంద్రబాబును సీఐడీ కస్టడీకి అప్పగించడంపై తీర్పును మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది కోర్టు. క్వాష్ పిటిషన్ పై హైకోర్టు మధ్యాహ్నం 1.30 గంటలకు తీర్పు ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పు వెలువడిన తరువాత తమ తీర్పు ఇస్తామంటూ వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. కాగా, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు రిమాండ్ నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో చంద్రబాబును సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో విచారణకు ప్రవేశపెట్టారు. విచారణ సందర్భంగా జడ్జి, చంద్రబాబు మధ్య కీలక సంభాషణ జరిగింది. విచారణ సందర్భంగా న్యాయమూర్తి ముందు చంద్రబాబు తన వెర్షన్ వినిపించారు. '45 ఏళ్ల సుధీర్ఘ రాజకీయ జీవితం నాది. నాకు నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేశారు. నా తప్పు ఉంటే విచారణ చేసి అరెస్టు చేయాల్సింది. నేను చేసిన అభివృద్ధి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. అన్యాయంగా నన్ను అరెస్టు చేశారు. ఇది నా బాధ, నా ఆవేదన, నా ఆక్రందన. ఈ వయసులో నాకు పెద్ద పనిష్మెంట్ ఇచ్చారు. నామీద ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. నిర్ధారణ కాలేదు. చట్టానికి అందరూ సమానమే.. చట్టాన్ని నేను గౌరవిస్తా' అని చెప్పారు. చంద్రబాబు మాటలకు స్పందించిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి.. 'ఇది ట్రైల్ కాదు. మీ మీద ఉన్నవి ఆరోపణలు మాత్రమే. మీరు మరోలా అర్ధం చేసుకోవొద్దు. ఈ కేసులో ఇంకా ఎలాంటి తీర్పు రాలేదు. మీరు చాలా పెద్దవారు. మీ మాటలను నేను అర్థం చేసుకోగలను. కోర్టు కి ఒక విధానం ఉంటుంది. వాటిని ఎవరు మార్చలేరు. కోర్ట్ దాని పరిధిలో పని చేస్తోంది. మీరు జ్యూడిషియల్ కస్టడీలో వున్నారు. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి. విచారణ చేస్తాం. మీరు మానసికంగా బాధ పడొద్దు. చట్టం విషయాన్ని మీరు హుందాతనంగా తీసుకోవాలి.' అన్నారు. Also Read: Andhra Pradesh: చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై నేడు తీర్పు.. ఏసీబీ కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ.. Telangana: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఇంటి స్థలాలు.. మరో పది రోజుల్లో పంపిణీ.. #andhra-pradesh #vijayawada #chandrababu-naidu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి