రూ. 100 కోట్లు కూడబెట్టాడు.. ఏసీబీ వలలో అవినీతి తిమింగలం

ఏసీబీ వలకు మరో భారీ తిమింగలం చిక్కింది. హెచ్‌ఎండీఏ టౌన్‌ ప్లానింగ్‌ విభాగం డైరెక్టర్ శివబాలకృష్ణ నివాసం, ఆఫీసులు, బంధువుల ఇళ్లలో సోదాలు జరిపి రూ. 100 కోట్లకు పైగా అక్రమాస్తులు కలిగి ఉన్నట్టు అధికారులు గుర్తించారు.

రూ. 100 కోట్లు కూడబెట్టాడు.. ఏసీబీ వలలో అవినీతి తిమింగలం
New Update

ACB rides: ఏసీబీ వలకు మరో భారీ తిమింగలం చిక్కింది. హెచ్‌ఎండీఏ టౌన్‌ ప్లానింగ్‌ విభాగం డైరెక్టర్ శివబాలకృష్ణ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు అవినీతి నిరోధక శాఖ గుర్తించింది. ప్రస్తుతం మెట్రో రైల్‌ ప్లానింగ్‌ అధికారిగా ఉన్న ఆయన ఇంట్లో బుధవారం ఉదయం నుంచే ఏసీబీ దాడులు మొదలు పెట్టింది. ఏకకాలంలో 14 బృందాలు బాలకృష్ణ నివాసం, ఆఫీసులు, బంధువుల ఇళ్లలో సోదాలు చేసింది. దాదాపు రూ.100 కోట్లకు పైగా స్థిర, చరాస్తులను అక్రమంగా ఆయనకు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. బ్యాంకు లాకర్లు ఇంకా తెరవాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: కుర్చీ మడత పెట్టేసిన పోలీసులు.. కాలా పాషా అలియాస్‌ కుర్చీ తాత అరెస్టు

రూ.40లక్షల నగదు, రెండు కిలోల బంగారంతో పాటు స్థిర, చర ఆస్తులకు సంబంధించిన కీలకమైన పత్రాలు, 60 ఖరీదైన చేతి గడియారాలు, 14 మొబైల్‌ ఫోన్లు, 10 ల్యాప్‌టాప్‌లు గుర్తించారు. మొత్తం రూ.100 కోట్ల విలువైన ఆస్తులు బయటపడ్డాయి. ఆయన నివాసంలో నగదు లెక్కింపు మెషిన్లను కూడా గుర్తించిన ఏసీబీ అధికారులు షాకయ్యారు.

తనిఖీలు గురువారం కూడా కొనసాగుతాయని అధికారులు తెలిపారు. హెచ్‌ఎండీఏలో ఉన్నప్పటి నుంచే ఆయన ఈ ఆస్తులన్నీ కూడబెట్టినట్టు అవినీతి నిరోధక శాఖ అధికారుల దర్యాప్తులో తేలింది. బ్యాంకు లాకర్లు, బంధువుల ఇళ్లలో సోదాలు పూర్తయితే మరికొన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే పలువురు రాజకీయ నాయకులతో పాటు ఉన్నతాధికారుల అండదండలు కూడా పుష్కలంగా ఉండడంతోనే ఇంత పెద్ద మొత్తంలో బాలకృష్ణ ఆస్తులు కూడగట్టగలిగారన్న ప్రచారం జరుగుతోంది.

#acb-rides #shiva-bala-krishna
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe