Abhishek Singhvi: రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేసిన అభిషేక్ మను సింఘ్వీ

TG: కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ ఉన్నారు.

New Update
Abhishek Singhvi: రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేసిన అభిషేక్ మను సింఘ్వీ

Abhishek Singhvi: ఇటీవల కేశవరావు రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీ నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ పత్రాన్ని రిటానింగ్ అధికారికి ఇచ్చారు. ఆయన వెంట సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ ఉన్నారు. కాగా ఈ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఎమ్మెల్యేల సంఖ్య బలంతో జరిగే ఈ ఎన్నికకు కాంగ్రెస్ కు ఎమ్మెల్యేల సంఖ్య బలం ఎక్కువగా ఉండడంతో ఈ ఎన్నిక ఏకగ్రీవం కానుంది.

బీఆర్ఎస్‌కు తగ్గిన సంఖ్య...

రాజ్యసభలో బీఆర్ఎస్ పార్టీకి సంఖ్య తగ్గింది. రాజ్యసభలో బీఆర్ఎస్ నుంచి ఐదుగురు రాజ్యసభలో ఉండగా.. ఆ పార్టీకి ఇటీవల సీనియర్ నేత కే . కేశవరావు రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం.. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తో పాటు తాను ఆ పార్టీ నుంచి ఎన్నికైన రాజ్యసభ స్థానానికి కూడా రాజీనామా చేశారు. దీంతో తెలంగాణ నుంచి రాజ్యసభలో ఒక స్థానం ఖాళీ అయింది. ఈ క్రమంలో రాజ్యసభలో బీఆర్ఎస్ సంఖ్య బలం ఐదు నుంచి నాలుగుకు తగ్గింది. కాగా ఇటీవల తెలంగాణతో సహా 11 రాష్ట్రాలకు సంబంధించి ఉప ఎన్నిక నోటిఫికేషన్ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. 21 వరకు నామినేషన్లు స్వీకరించనుంది. సెప్టెంబర్ 3న ఎన్నికను నిర్వహించి అదేరోజు ఎన్నిక ఫలితాన్ని విడుదల చేయనుంది.

Also Read : ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ మాజీ ఎండీ సస్పెండ్

Advertisment
తాజా కథనాలు