Bengal CM: మమత బెనర్జీ సంచలన నిర్ణయం.. బెంగాల్ నెక్ట్స్ సీఎం అతడే?

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన రాజకీయ వారసుడిని ప్రకటించారు. బెనర్జీ 2036లో రాజకీయాలనుంచి తప్పుకోగానే ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ బెంగాల్ ముఖ్యమంత్రిగా అధికారం చేపడతారని TMC అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ వెల్లడించారు.

New Update
Bengal CM: మమత బెనర్జీ సంచలన నిర్ణయం.. బెంగాల్ నెక్ట్స్ సీఎం అతడే?

Abhishek Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన తర్వాత బెంగాల్ ముఖ్యమంత్రి పదవి తన వారుసుడికే కట్టబెట్టబోతున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు హుగ్లీ జిల్లాలోని చుచురాలో మీడియాతో మాట్లాడిన TMC అధికార ప్రతినిధి కునాల్ ఘోష్.. మమతా బెనర్జీ రాజకీయాలనుంచి తప్పుకోగానే ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ బెంగాల్ ముఖ్యమంత్రిగా అధికారం చేపడతారన్నారు.

మేము మమతా దీదీ నాయకత్వంలోనే పోటీ చేసినప్పటికీ మాకు అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee) జనరల్‌గా ఉంటారని ధృవీకరిస్తున్నాం. ఆమె 2036 వరకు సిఎంగా ఉంటారు. ఆపై లాఠీ అభిషేక్‌కు ఇవ్వబడుతుంది. అలాగే పశ్చిమ బెంగాల్‌ను స్వాధీనం చేసుకోవాలని పగటి కలలు కంటున్న వారందరూ వారి అన్వేషణను అందుకోలేరు. ఎందుకంటే ఘోష్ ఇప్పటికే ప్రతిపక్షాలపై అటాక్ మొదలుపెట్టినట్లు  ఘోష్ వెల్లడించారు.

ఇక పశ్చిమ బెంగాల్ రాజకీయ వర్గాల్లో 'యువ తరం రాజకీయ నాయకులు vs ముసలి గార్డు' అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఘోష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'రాజకీయాల్లో లేదా మరే ఇతర రంగంలో అయినా.. గరిష్ట వయోపరిమితి ఉండాలని నేను నమ్ముతున్నా. ఒక వ్యక్తి 30 ఏళ్లలో మొదలుపెట్టిన ఒక పనిని 50 వరకూ విరామం లేకుండా చేయొచ్చు. కానీ అదే పనిని 80 ఏళ్ల వ్యక్తి చేయలేడు. అయితే ఈ విషయంలో తాను ఎవరినీ నిందించడం లేదు. అనుభవజ్ఞులు, సీనియర్లు వారి అనుభవాలు కూడా రాజకీయాల్లో ముఖ్యమైనవే' అని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి : BIG BREAKING: కళ్లు చెదిరే రికార్డు ధర..రూ.20.5 కోట్లకు పాట్ కమ్మిన్స్ ను కొనుగోలు చేసిన SRH!

ఇదిలావుంటే.. అభిషేక్ బెనర్జీ ప్రకటనపై నేతాజీ ఇండోర్ స్టేడియంలో జరిగిన TMC అడ్మినిస్ట్రేటివ్ సమావేశంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. పార్టీలో వయస్సు అడ్డంకి కాదన్నారు. పార్టీలో పెద్దలను గౌరవించాలని యువ తరానికి ఆమె పిలుపునిచ్చారు. యువకులకు స్వాగతం పలకాలని సీనియర్ రాజకీయ నాయకులను కోరారు. 'యువ తరం రాజకీయ నాయకులు పాత గార్డును గౌరవించాలి. సౌగత (రాయ్) తనకు వృద్ధాప్యమైందని కొన్నిసార్లు చెబుతారు. అది ఏ వయసు? హృదయానికి వయస్సు లేదు. మేము బతికి ఉన్నంత కాలం బెంగాల్ రాజపులిలా పోరాడతాం' అని మమత అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు