మాస్ మహారాజ్ రవితేజ (Raviteja) కి షూటింగ్ లో కాలికి గాయం కావడంతో 12 కుట్లు వేయించుకుని మరీ షూటింగ్ లో పాల్గొన్నడాని చిత్ర నిర్మాత ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇంతకీ అసలు రవితేజకి ఎప్పుడూ గాయం అయ్యింది..ఏ సినిమా షూటింగ్ లో ఆయనకు అంత పెద్ద దెబ్బ తగిలింది అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.
ప్రస్తుతం రవితేజ దర్శకుడు వంశీ కాంబినేషన్లో టైగర్ నాగేశ్వరరావు సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఓ ఇంటర్యూలో అభిషేక్ అగర్వాల్ రవితేజ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమాలో ట్రైన్ దోపిడీ సన్నివేశం చేస్తున్నప్పుడు ట్రైన్ మీద నుంచి లోపలి దూకే షాట్ ఒకటి ఉంటుంది. ఆ షాట్ లో రవితేజ అదుపు తప్పి కిందపడ్డారు. మోకాలికి బాగా దెబ్బ తగిలింది.
Also read: కాంగ్రెస్ కు పొన్నాల లక్ష్మయ్య రాజీనామా.. ఆ పార్టీలో చేరే ఛాన్స్?
చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా ఆయనకు ఆపరేషన్ చేసి 12 కుట్లు వేశారు. ఆ షాట్ లో సుమారు 400 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. దీంతో షూటింగ్ కానీ వాయిదా వేస్తే నిర్మాతకు చాలా నష్టం వస్తుందని ఆలోచించిన రవి..కేవలం రెండు రోజుల్లోనే మళ్లీ షూటింగ్
కి తిరిగి వచ్చారు.
కాలికి పూర్తిగా దెబ్బ తగ్గే వరకు విశ్రాంతి తీసుకోమని డైరెక్టర్ నేను ఎంత చెప్పినా వినకుండా బడ్జెట్ పెరిగిపోతుందని షూటింగ్ కి వచ్చేశారు. ఆయనకు అలాంటి డెడికేషన్ ఉందని అగర్వాల్ అన్నారు. ఈ విషయం గురించి తెలుసుకున్న రవి అభిమానులు ఆయన మీద అభినందనలు కురిపిస్తున్నారు.
ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో హీరోయిన్లుగా నూపర్ సనన్, గాయత్రి భరద్వాజ్ నటిస్తున్నారు. రేణూదేశాయ్, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ ప్రధాన పాత్రలు పోషించబోతున్నారు. ఈ సినిమాకి జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ దసరా కానుకగా ఈ చిత్రం అక్టోబర్ 20 న విడుదల కాబోతుంది.
రవితేజ మొదటి సారి పీరియాడిక్ సినిమా చేయడం, భారీ బడ్జెట్ తో తెరకెక్కించడం, స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథతో తీయడం.. ఇవన్నీ సినిమాపై అంచనాలను నెలకొల్పాయి. ఇక ఇప్పటికే రిలీజయిన ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.