Abhaya case: కోల్‌కతా జూనియర్ డాక్టర్ అభయ హత్యాచార కేసులో సీఎం మమతా బెనర్జీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దేశాన్ని కుదిపేస్తున్న ఈ ఘటనపై మమతా స్పందించిన తీరుపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిరసనలు చేస్తున్న వారిని అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మమతా బెనర్జీ రాజీనామా చేయాలంటు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మమత తీరుపై బాధితురాలి పేరెంట్స్ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
మమతా బెనర్జీపై నమ్మకం పోయింది..
ఈ మేకు కేసు దర్యాప్తులో పోలీసులు వ్యవహరించిన తీరు చూసి తమకు మమతా బెనర్జీపై నమ్మకం పోయిందని అభయ తండ్రి చెప్పారు. కనీసం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అయినా ప్రయత్నం చేస్తోందని నమ్ముతున్నామన్నారు. 'మమతా బెనర్జీపై నాకు పూర్తి నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు పోయింది. మా కూతురు కోసం అందరూ న్యాయం కావాలని అడుగుతున్నారు. కానీ ఆమె ఎందుకు అలా మాట్లాడుతోంది? ఆ కేసులో ఆమె ఏమీ చేయడం లేదు. మాకు న్యాయం కావాలి అని అడుగుతున్న సామాన్య ప్రజానీకాన్ని లాక్కెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మమతా ప్రభుత్వం తీసుకొచ్చిన కన్యాశ్రీ పథకం, లక్ష్మీ పథకాలన్నీ నకిలీవి. ఎవరైతే ఈ పథకాలను పొందాలనుకుంటున్నారో వాటిని పొందే ముందు మీ లక్ష్మి ఇంట్లో భద్రంగా ఉందోలేదో దయచేసి చూసుకోవాలని అభయ తల్లి విమర్శించారు.