/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-93-jpg.webp)
Aamir Khan: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తన కూతురు పెళ్లిలో వ్యవహరించిన తీరు చర్చనీయాంశమైంది. అమీర్ ముద్దుల కూతురు ఐరా ఖాన్ (Ira Khan), ప్రియుడు, ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరే (Nupur Shikhare)ను బుధవారం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. బంధువులు, స్నేహితుల సమక్షంలో వీరిద్దరి రిజిస్టర్ మ్యారేజ్ ముంబైలోని ఓ హోటల్‌లో ఘనంగా జరగగా ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Aamir Khan's ex-wife Kiran Rao smiles as he greets her with a kiss at daughter Ira Khan's wedding 🤗😘
.
.
.#AamirKhan #KiranRao #IraKhan #IraKhanNupurShikhare #IraKhanNupurShikhare #IF #IndiaFourms #Bollywood #BollywoodStars pic.twitter.com/aYqceOKPVg— India Forums (@indiaforums) January 4, 2024
ఇక ఈ వివాహ వేడుకు సినీ, రాజకీయ ప్రముఖులతోపాటు అమీర్ ఖాన్ భార్య హాజరై సందడి చేశారు. అమీర్ మాజీ భార్య కిరణ్ రావు తన కొడుకు ఆజాద్ తో కలిసి పెళ్లికి వచ్చింది. అనంతరం అదే హోటల్‌లో రిసెప్షన్ జరిగగా.. వధూవరులతో కలిసి ఫొటోలకు పోజిచ్చారు. అయితే వివాహం తర్వాత మాజీ భార్య కిరణ్ రావుతో కాసేపు మాట్లాడిన అమీర్ ఖాన్.. కిరణ్‌ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని చెంపపై ముద్దు పెట్టడం విశేషం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి : Attacked On Judge In USA:అమెరికాలో కోర్టు రూమ్‌లో జడ్జిని చితక్కొట్టిన నిందితుడు
ఇక నిర్మాత కిరణ్ రావును (Kiran Rao) పదిహేడేళ్ల క్రితం అమీర్ ఖాన్ పెళ్లి చేసుకోగా.. 2021లో వీరిద్దరూ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. కాగా ఈనెల 8వ తేదీన ఐరా ఖాన్, నుపుర్ శిఖరేలు మరోసారి వివాహ వేడుక జరుపుకోనున్నారు. జనవరి 13వ ముంబైలో గ్రాండ్‌గా రిషిప్షన్ జరగనుంది.