/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/IRA-1-jpg.webp)
Aamir Khan : బాలీవుడ్(Bollywood) మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్(Aamir Khan), సినీ నిర్మాత రీనా దత్త(Reena Dutta) ల కుమార్తె ఐరాఖాన్(IRA KHAN) వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. బంధువులు, స్నేహితుల సమక్షంలో తన ప్రియుడు, ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరేను ఐరాఖాన్ వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి ముంబైలోని ఓ హోటల్లో గ్రాండ్ గా జరిగింది. రిజిస్టర్ మ్యారేజ్(Register Marriage)తో ఐరా-నుపుర్(Aira-Nupur) జంట ఒక్కటైంది. వీరి వివాహానికి అమీర్ ఖాన్, తన మాజీ భార్యలు రీనా దత్త, కిరణ్ రావు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ నీతా అంబానీ దంపతులు, ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు హాజరయ్యారు. పెళ్లి తర్వాత అదే హోటల్లో రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. ఐరా-నుపుర్ పెళ్లి ఫొటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
#WATCH | Actor Aamir Khan attends daughter Ira Khan & Nupur Shikhare wedding reception at Taj Lands End, Bandra in Mumbai.
The couple solemnized their relationship via a registered marriage. pic.twitter.com/qsaQe0JDPy
— ANI (@ANI) January 3, 2024
ఐరా ఖాన్ సినిప్రియులకు పరిచయమే. మెంటల్ హెల్త్ సపోర్ట్ ఆర్గనైజేషన్ సంస్థ వ్యవస్థపకురాలు, సీఈవో అయిన ఐరా..తరచుగా మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియా పోస్టులు పెడుతుంటారు. గత కొన్నేళ్లుగా అమిర్ ఖాన్ కు నుపుర్ పర్సనల్ ఫిట్నెస్ ట్రైనర్ గా ఉన్నారు. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.
ఐరాతో వివాహానికి ముందు నుపుర్ తన నివాసం నుంచి జాగింగ్ చేస్తూ హోటల్ కు వచ్చారు. జాగింగ్ దుస్తుల్లోనే ఐరాను వివాహం చేసుకున్నారు. ఈనెల 8న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఈ జంట మరోసారి పెళ్లి చేసుకోనుంది. జనవరి 13న ముంబైలో వివాహ విందు ఏర్పాటు చేయనున్నారు.
ఇది కూడా చదవండి: నేడు కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తారా? ఆప్ నేతల వరుస పోస్టులు అందుకేనా?