Aadhaar Card Download Process: మన దేశంలో ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు తప్పనిసరి. ఈ గుర్తింపు కార్డు లేకపోతే మన పనులు అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే మనకు సంబంధించిన ముఖ్యమైన పనులు బ్యాంకు అకౌంట్లు, ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ పనుల కోసం ఆధార్ కార్డు అవసరం పడుతుంది. అంతేందుకు ఆడవారికి ఫ్రీగా బస్సు జర్నీ కావాలన్నా ఆధార్ కార్డు ఉంటేనే. అయితే మనలో చాలా మందితో ఆధార్ కార్డు ఉన్నప్పటికీ, దానికి మొబైల్ నెంబర్ లింక్ కాని వారు, KYC అప్డేట్ ఆధార్ కార్డును సమర్పించని వారు చాలా మందే ఉన్నారు. అలాంటి వారంతా ఎలాంటి సేవలను పొందలేరనుకుంటే పొరబడినట్టే.. ఎందుకంటే మీరు ఆన్ లైన్‌లో ఆధార్ కార్డును చాలా సులభంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దీనికి OTP అవసరం కూడా లేదు. ఈ సందర్భంగా ఈ-ఆధార్ కార్డును ఈజీగా ఎలా డౌన్ లోడ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం...
మన దేశ జనాభాలో ఎలాంటి ప్రభుత్వ సబ్సిడీలు లేదా ఇతర ప్రయోజనాలు కావాలనుకునే వారికి ఆధార్ కార్డు కచ్చితంగా అవసరం పడుతుంది. కేంద్రం, రాష్ట్రంలోని పథకాలను పొందాలంటే ఆధార్ కార్డు కాపీని కచ్చితంగా సమర్పించాలి.
KYC ధృవీకరణ..
ఈ ఆధార్ KYC అనేది యూజర్ గురించి తెలుసుకోవడానికి సహాయపడుతుంది. ఇది బ్యాంకుల నుంచి టెలికాంల వరకు అనేక సంస్థలచే చేయబడుతుంది. కస్టమర్ యొక్క గుర్తింపును ధృవీకరించడానికి KYC చేయబడుతుంది. దీనికి అవసరమైన ప్రధానపత్రం ఆధార్ కార్డు. ప్రస్తుతం దేశంలో ఏ చోటు అయినా ఆధార్ కార్డు గుర్తింపు కార్డుగా పరిగణించబడుతుంది. ఓటు వేయడం నుంచి హోటల్ చెకింగ్ వరకు, ఆధార్ కార్డు మీ గుర్తింపు కార్డుగా అంగీకరించబడుతుంది.
ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి...
* ముందుగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లేదా డెస్క్‌టాప్ నుంచి UIDAI అధికారిక వెబ్‌సైట్ పేరును సెర్చ్ చేసి, దానిపై క్లిక్ చేయండి.
* ఆ తర్వాత మీకు ఏ భాష కావాలో సెలెక్ట్ చేసుకోండి.
* లెఫ్ట్ సైడ్ టాప్ మెనూలో ‘‘My Aadhar ’’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
* ఆ తర్వాత ‘‘Download Aadhar’’ ఆప్షన్ కిందకి స్క్రోల్ చేస్తే ‘ఆర్డర్ ఆధార్ రీప్రింట్’ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
* అక్కడ 12 అంకెల ఆధార్ నెంబర్ లేదా 16 నెంబర్లు ఉండే వర్చువల్ గుర్తింపు సంఖ్యను ఎంటర్ చేయండి.
* అనంతరం క్యాప్చా కోడ్‌తో సమర్పించాలి.
* ఆ తర్వాత ‘నా మొబైల్ నెంబర్ రిజిస్ట్రర్ చేయబడలేదు’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
* ప్రత్యామ్నాయ నెంబర్ లేదా ఇంతకుముందు ఎప్పుడూ ఇవ్వని నెంబర్ ఎంటర్ చేయండి.
* అప్పుడు ఆ ఫోన్ నెంబర్‌కి OTP వస్తుంది.
* ఆ ఓటిపిని ఎంటర్ చేసి, క్లిక్ చేస్తే చాలు ఆధార్ కార్డును ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Also Read: విద్యార్థులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్..భారీగా ఆర్థిక సాయం.. అప్లయ్ చేసుకోండిలా.!