Aadhar Update : ఆధార్ ఫ్రీ అప్‎డేట్ పొడిగింపు..గడువు మరో మూడు నెలల..ఇలా అప్ డేట్ చేసుకోండి..!

ఆన్ లైన్లో ఆధార్ కార్డును ఫ్రీగా అప్ డేట్ చేసుకునేందుకు మరో మూడు నెలల గడువును పొడిగించింది యూఐడీఏఐ. 2024 జూన్ 14 వరకు ఉచితంగా ఆధార్ ను అప్ డేట్ చేసుకోవచ్చు. గత 10ఏళ్లలో ఒక్కసారి కూడా అప్ డేట్ చేసుకోని వారు తమ ఆధార్ ను కచ్చితంగా అప్ డేట్ చేసుకోవల్సి ఉంటుంది.

Aadhar Update : ఆధార్ ఫ్రీ అప్‎డేట్ పొడిగింపు..గడువు మరో మూడు నెలల..ఇలా అప్ డేట్ చేసుకోండి..!
New Update

Aadhaar Card Update: ఆన్ లైన్లో ఆధార్ కార్డును ఫ్రీగా అప్ డేట్ చేసుకునేందుకు మరో మూడు నెలల గడువును పొడిగించింది యూఐడీఏఐ. 2024 జూన్ 14 వరకు ఉచితంగా ఆధార్ ను అప్ డేట్ చేసుకోవచ్చు. గత 10ఏళ్లలో ఒక్కసారి కూడా అప్ డేట్ చేసుకోని వారు తమ ఆధార్ ను కచ్చితంగా అప్ డేట్ చేసుకోవల్సి ఉంటుంది. అలాగే 5ఏండ్ల లోపు పిల్లల ఆధార్ కూడా అప్ డేట్ చేసుకోవాలి. అలాంటి వారు ఈ ఫ్రీ సేవలను వినియోగించుకోవాలని యూఐడీఏఐ కోరుతోంది. మై ఆధార్ పోర్టల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఆధార్ అప్ డేట్ వల్ల వ్యక్తుల డేటా ఆక్యురేట్ గా ఉంటుంది.

ఇలా అప్ డేట్ చేసుకోండి:
https://uidai.gov.in/en/my-aadhaar/ వెబ్ సైట్లో ఆధార్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వాలి.

-ఆధార్ అప్ డేట్ చేసుకునేందుకు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను నిక్షిప్తం చేసేందుకు ప్రొసీడ్ టు అప్ డేట్ అడ్రస్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

-దీనిలో పేరు, ఇతర వివరాలను రుజువు చేస్తూ తగిన ధ్రువపత్రాలు అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.

-తర్వాత చిరునామా నిరూపించేలా మరో పత్రాన్ని అప్ లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.

-రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి డాక్యుమెంట్ అప్ డేట్ పై క్లిక్ చేయాలి. అప్పటికే ఉన్న వివరాలు స్క్రీన్ పై కనిపిస్తాయి. ఒకవేళ వీటిలో సవరణ ఉంటే చేసుకోవాలి. లేదా ఉన్న వివరాలను వెరిపై చేసుకోని తర్వాత పై క్లిక్ చేయాలి.

-తర్వాత కనిపించే డ్రాప్ డౌన్ జాబితా నుంచి ఫ్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ఫ్రూఫ్ ఆఫ్ అడ్రస్ డాక్యుమెంట్లను సెలక్ట్ చేసుకోవాలి.
-ఆయా డాక్యుమెంట్లు స్కాన్ కాపీలను అప్ లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.

-14అంకెల అప్ డేట్ రిక్వెస్ట్ నెంబర్ వస్తుంది. దీనితో అప్ డేట్ స్టేటస్ ఎక్కడి వరకు వచ్చిందో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు.

-ఇందులో ఏమైనా సమస్యలు తలెత్తితే టోల్ ఫ్రీ 1947 నెంబర్ కు కాలో చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: తెలంగాణ వాసులకు అలెర్ట్…ఏప్రిల్ 1 నుంచి జాగ్రత్తగా ఉండాలన్న ఐఎండీ..!

#aadhar-update
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe