మానవ అక్రమ రవాణా జరుగుతుందనే అనుమానంతో భారతీయులతో నికరాగువా వెళ్తున్న ఓ విమానాన్ని ఫ్రాన్స్ విమానాశ్రయాధికారులు నిలిపివేశారు. ఈ సంఘటనలో అధికారులు విమానంలోని ఇద్దరు ప్రయాణికులను అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. దీంతో ఈ ఘటన గురించి తాజాగా భారత రాయబార కార్యాలయం స్పందించింది.
కేవలం విమానంలో హ్యుమాన్ ట్రాఫికింగ్ జరుగుతుందనే సమాచారం ఫ్రాన్స్ అధికారులకు రావడంతోనే భారతీయులు ప్రయాణిస్తున్న విమానాన్ని నిలిపివేసినట్లు అధికారులు సమాచారం అందించారని రాయబార కార్యాలయం అధికారులు వివరించారు. ఏ 340 విమానంలో మొత్తం 303 మంది ప్రయాణికులు ఉండగా..వారిలో ముప్పావు వంతు ప్రయాణికులు భారతీయులే అని కార్యాలయ అధికారులు వివరించారు.
వీరిలో కొందరు మైనర్లు కూడా ఉన్నారని అధికారులు వివరించారు. ప్రయాణికుల భద్రత పై ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని, వారంతా క్షేమంగానే ఉన్నారని..అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఎంబసీ అధికారులు తెలిపారు. విమానంలో ఉన్న భారత సంతతి ప్రయాణికులు చాలా మంది యూఏఈలో పని చేస్తూ ఉండొచ్చని అధికారులు భావిస్తున్నట్లు తెలిపారు.
ఈ ఘటన గురించి విచారణ జరుపుతున్నామని, భారతీయ ప్రయాణికుల తప్పులేదని అధికారులు భావిస్తున్నట్లు రాయబార కార్యాలయాధికారులు వివరించారు. ఈ సంఘట గురించి భారత ఎంబసీ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
‘303 మంది ప్రయాణికులతో నికరాగువా వెళుతున్న విమానాన్ని ఆపేసినట్లు ఫ్రెంచ్ అధికారులు తెలియజేశారు. వీరిలో ఎక్కువ మంది భారతీయులు దుబాయ్ నుంచి నికరాగువా వెళుతున్నారు. మానవ అక్రమరవాణా జరుగుతోందనే సమాచారం అందడంతో ఫ్రెంచ్ విమానాశ్రయంలో విమానాన్ని నిలిపివేశారు. ఎంబసీ బృందానికి కాన్సులర్ యాక్సెస్ లభించింది. పరిస్థితిని పరిశీలిస్తున్నాం. ప్రయాణికులను విచారిస్తున్నాం’ అంటూ భారత ఎంబసీ ట్వీట్ చేసింది.
Also read: సాయం కోసం ఫోన్ చేస్తే ఆమెనే కాల్చి చంపిన పోలీసులు!