/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/boy-1-jpg.webp)
A Naked man beat up a Las Vegas Metro Police officer: అమెరికాలోని లాస్ వెగాస్ సిటీలో ఓ యువకుడు హల్ చల్ చేశాడు. నగ్నంగా రోడ్లపై తిరుగుతూ వీరంగం సృష్టించాడు. ఆ యువకుడిపై వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీస్ అధికారిపై దాడి చేశాడు ఆ యువకుడు. ఆపై పోలీస్ పెట్రోలింగ్ కారును ఎత్తుకెళ్లాడు. వేగంగా దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీ కొట్టాడు. దీంతో ఆ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని, వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షలకు పంపినట్లు వెల్లడించారు. ఈ ఘటనలో పోలీస్ ఆఫీసర్ కు స్వల్ప గాయాలయ్యాయని వివరించారు.
Last night a naked man beat up a Las Vegas Metro Police officer and then stole his truck (🎥 Kyle Even) pic.twitter.com/RJwXQINyoa
— Las Vegas Locally 🌴 (@LasVegasLocally) November 1, 2023
రోడ్లపై నగ్నంగా తిరుగుతూ వాహనదారులను భయాందోళనకు గురిచేసిన వ్యక్తిని క్లైడే కాబులిసన్ (29) గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. క్లైడే మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడని అనుమానం వ్యక్తం చేశారు. అయినప్పటికీ క్లైడేపై దొంగతనం (పోలీస్ పెట్రోల్ కార్ ఎత్తుకెళ్లినందుకు), పోలీస్ అధికారి ఆదేశాలను ధిక్కరించడం, వెహికల్ యాక్ట్ రూల్స్ ఉల్లంఘన ఆరోపణలు నమోదు చేసినట్లు వివరించారు. కాగా, అక్కడే ఉన్న ఓ కార్ డ్రైవర్ ఈ ఘటన మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.