/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/wife-jpg.webp)
wife and Husband war: రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి తన భార్య దగ్గరకు వచ్చి ఏదో చెబుతాడు. అతడు ఏమన్నాడో తెలీదు కానీ భార్యకు మాత్రం తిక్కరేగింది. వెంటనే వెనక్కు తిరిగి చేత్తో అతడి ముఖంపై గట్టిగా కొట్టింది. అక్కడి నుంచి వారి మధ్య పెద్ద ఘర్షణ మొదలైంది. మొగుడిని కొట్టిన ఆమె ఆ తరువాత ఒక్కసారిగా అతడి నడుము చుట్టూ చేతులేసి పైకెత్తి కింద పడేసింది. ఆ తరువాత అతడిపై పడి పిడిగుద్దులు కురిపించింది.
Also Read: పేకాట ఆడిన సూపర్ స్టార్ మహేశ్ బాబు, విక్టరీ వెంకటేశ్.!
Hi @bisping 👋, where does this take down stand is your top 10 list? #ufcpic.twitter.com/LrhTalD2pK
— Bharat (@2673Bharat) November 3, 2023
ఇక చుట్టుపక్కల వారు ఈ సీన్ చూసి ఆశ్చర్యపోయారు. మహిళ ఆ రేంజ్‌లో మొగుడిని రఫ్ ఆడించడంపై అందరూ నోరెళ్లబెట్టారు. మహిళ భర్తను ఫుట్ బాల్ ఆడుతున్నా కూడా ఆమెను అడ్డుకునేందుకు ఒక్కరు కూడా ధైర్యం చేసి ముందుకు రాలేక పోతారు. మరోవైపు, ఈ సంఘటనను చూసి భలే కొట్టిందిరా అంటూ నవ్వుకున్నారు. కొందరు ఇదంతా రికార్డు చేసి నెట్టింట పోస్ట్ చేయడంతో భార్య భర్తల గొడవ వీడియో తెగ వైరల్ అవుతోంది. మహిళ తన భర్తను చిత్తకొట్టిన తీరు నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. భార్యాభర్తల మధ్య ఇలాంటి ఫైట్‌ను తామెప్పుడూ చూడలేదని నెటిజన్లు వేలాదిగా కామెంట్లు పెడుతున్నారు.