Union Minister Savitri Thakur : కేంద్ర ప్రభుత్వ నినాదాన్ని తన సొంత భాషలో రాయలేకపోవడంతో.. కేంద్రమంత్రి సావిత్రి ఠాకూర్‌పై సోషల్ మీడియా (Social Media) లో నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన సావిత్రి ఠాకూర్ (Savitri Thakur).. ఆ మాత్రం రాలేరా అంటూ విమర్శిస్తున్నారు. ప్రభుత్వ పథకానికి సంబంధించి నిర్వహించిన కార్యక్రమానికి వెళ్లిన కేంద్రమంత్రి సావిత్రి ఠాకూర్ అక్కడ బేటీ బజావో-బేటీ పడావో అనే వాక్యం తప్పులు లేకుండా రాయలేకపయారు. సొంత భాషలో ఆమె కేంద్ర ప్రభుత్వ పథకం పేరు రాయడంలో విఫలం అయ్యారు.
మంత్రి రాయలేకపోయిన వీడియోను అక్కడ ఉన్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో... అది కాస్తా తెగ వైరల్ అవుతోంది. ఒక కేంద్రమంత్రి.. కేంద్ర ప్రభుత్వ నినాదాన్ని తప్పుగా రాయడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తతున్నాయి. ఇంటర్ పాస్ అయిన కేంద్రమంత్రి.. "బేటీ బచావో - బేటీ పఢావో" నినాదాన్ని సరిగ్గా రాయలేకపోవడంతో ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి వారు దేశ మంత్రిగా బాధ్యతలు ఎలా నిర్వహిస్తారు అంటూ ఆగ్రం వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు ఇంకొంచెం ముందు వెళ్ళి మన ఖర్మ ఇలా కాలదంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు కూడా. 2024 లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లోని ధార్ నియోజకవర్గం నుంచి 46 ఏళ్ల సావిత్రి ఠాకూర్ ఎంపీగా ఎన్నికయ్యారు. ధార్ లోక్‌సభ స్థానం నుంచి సావిత్రి ఠాకూర్ 2 లక్షల 18 వేల 665 ఓట్లతో గెలుపొందడం గమనార్హం. ఇక అంతకుముందు 2004 నుంచి 2009 వరకు జిల్లా పంచాయతీ అధ్యక్షురాలిగా సావిత్రి ఠాకూర్ ఉన్నారు. ఆ తర్వాత 2014లో తొలిసారి ఎంపీ అయ్యారు. రాజకీయాల్లోకి రాకముందు ఆమె ఓ ఎన్జీవోలో కో ఆర్డినేటర్‌గా కూడా పనిచేశారు.
Also Read:USA: అమెరికాలో చోరీలకు పాల్పడుతున్న తెలుగు యువతుల అరెస్ట్..