హైదరాబాద్ లో దొంగ-పోలీస్ హైడ్రామా.. చివరికీ ఏమైందంటే

హైదరబాద్ లోని సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగ-పోలీసుల మధ్య హైడ్రామా చోటుచేసుకుంది. తాళం వేసిన ఇంట్లోకి చొరబడ్డ దొంగ అనుకోకుండా వాళ్లు రావడంతో పక్కనున్న చెరువులోకి దూకేశాడు. పోలీసులు చెరువులోంచి బయకు రమ్మంటే సీఎం వచ్చి కొట్టమని మాటివ్వాలంటూ కండీషన్ పెట్టాడు.

New Update
హైదరాబాద్ లో దొంగ-పోలీస్ హైడ్రామా.. చివరికీ ఏమైందంటే

Thief - Police : హైదరాబాద్(Hyderabad) లో ఓ దొంగ తన వింత చేష్టలతో పోలీసులకు చుక్కలు చూపించాడు. తాళం వేసిన ఇంటిని దొచుకునేందుకు వెళ్లిన అతన్ని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులతో ఓ ఆటాడేసుకున్నాడు. కొన్ని గంటలపాటు విసిగించిన ఆ వ్యక్తి చివరకు దొరికినట్లే దొరికి జారిపోయాడు. ప్రస్తుతం ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది.

ఈ మేరకు హైదరబాద్ లోని సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో దొంగతనానికి వెళ్లిన దొంగకు ఇంటి యజమాని ఊహించని షాక్ ఇచ్చాడు. బయటకెళ్లిన ఓనర్ సడెన్ గా ఇంటికి తిరిగి రావడంతో గందరగోళానికి గురయ్యాడు అగంతకుడు. ఏమీ చేయాలో తోచక ఇంటి పక్కనే ఉన్న చెరువులోకి దూకేశాడు. అయితే చాలాసేపు నీళ్లలో గడిపిన తాను చివరికీ అలసిపోవడంతో ఆ చెరువు మధ్యలో ఉన్న బండ రాయి మీద కూర్చుకున్నాడు. ఈ క్రమంలోనే ఇంటి యజమాని సమాచారంతో అక్కడికి చేరకున్న పోలీసులు దొంగను బయటకు రావాలని చెప్పగా.. రానంటే రానని మొండికేశాడు. ఒకవేళ తాను దొరికితే పోలీసులు కొడతారని, ఏమీ అనమని మాట ఇస్తేనే వస్తానన్నాడు. అయితే దీనికి పోలీసులు ఒకే అన్నప్పటికీ మరో ట్విస్ట్ ఇచ్చాడు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, లేదా ప్రస్తుత సీఎం అక్కడకు వస్తేనే చెరువునుండి బయటకు వస్తానని కండీషన్ పెట్టాడు.

ఇది కూడా చదవండి : కుత్బుల్లాపూర్‌లో కూల్చివేతలు.. కిరోసిన్ పోసుకున్న స్థానికులు

సూరారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగలక్ష్మి దంపతులు శుక్రవారం ఇంటి తాళం వేసి ఒక ఫంక్షన్ కు వెళ్లారు. అయితే సాయంత్రం 4.30గంటలకు వారి రెండో కూతురు సాయి జ్యోతి ఇంటికి వచ్చేసరికి గేటు తాళం వేసే ఉంది. కానీ ఇంటి తలుపులు తెరిచి కనిపించాయి. దీంతో వేగంగా లోపలకు వెళ్లిన సాయి.. బెడ్రూంలో దొంగ డబ్బులు లెక్కిస్తున్నట్లు గుర్తించింది. వెంటనే దొంగ, దొంగ అని అరవడంతో అతను బయటకు పారిపోయాడు. అప్పటికే అక్కడకు చేరకుకున్న స్థానికులు అతన్ని వెంబడించారు. ఏమీ చేయాలో చెరువులోకి దూకాడు. బయటకు రమ్మంటే రానన్నాడు. కొట్టమని ఎంత చెప్పినా వినలేదు. తాను బయటకు రావాలంటే ముఖ్యమంత్రి కానీ మాజీ సీఎం కానీ వస్తేనే చెరువులో నుంచి బయటకు వస్తానంటూ కండీషన్ పెట్టాడు. అర్థరాత్రి ఒంటి గంట వరకు ఈ హైడ్రామా కొనసాగగా చివరకు అతను అక్కడినుంచి నీళ్లలోనే మరో చోటుకు వెళ్లిపోయాడని, ఈ ఉదయం అతన్ని పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. ఇక తమ ఇంట్లోనుంచి అతను ఇరవై వేల నగదు దోచుకెళ్లినట్లు బాధితులు చెబుతున్నారు.

Advertisment
తాజా కథనాలు