/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-25T141742.150-jpg.webp)
దక్షిణామెరికాలోని పెరూలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు లోయలో పడి సుమారు 23 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం సోమవారం సాయంత్రం జరిగింది. బస్సు ప్రమాదవశాత్తు 1000 అడుగుల లోయలో పడిపోయింది.
అయితే ఈ ప్రమాదంలో ఇంకెంత మంది ప్రయాణికులు ఉన్నారనే సమాచారం ఇంకా తెలియరాలేదు. బస్సు తయాబాంబా నుంచి లిమా వెళ్తుండగా ఉత్తర పెరువియన్ జిల్లా కుస్కాలోని రహదారి పై ఈ దారుణ ప్రమాదం జరిగింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది చర్యలు చేపట్టారు. పెరూలో జరిగే ప్రమాదాలకు అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ కారణమని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం పేర్కొంది.
Also read: ప్రస్తుత కాలంలో మహిళలు వేగంగా ఈ వ్యాధుల బారిన పడుతున్నారు..ఈ లక్షణాలుంటే జాగ్రత్త!