నాలుగు గంటలు.. గోదావరిలో.. ప్రాణాలు అరచేతిలో..

చుట్టూ చీకటి. అంతా నిశ్శబ్దం. కనుచూపుమేర ఎక్కడా కనిపించని జనం. కింద ఉదృతంగా ప్రవహిస్తున్న గోదావరి.. పట్టు తప్పితే ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయం. కానీ ఓ 13 ఏళ్ల బాలిక మాత్రం ధైర్యంగా ఆ భయానకమైన పరిస్థితిని ఫేస్ చేసి ప్రాణాలతో బయటపడింది.

నాలుగు గంటలు.. గోదావరిలో.. ప్రాణాలు అరచేతిలో..
New Update

సెల్పీ పేరుతో గోదాట్లోకి.. 

నమ్మిన వ్యక్తి నట్టేట్లో ముంచేశాడు. సెల్ఫీ తీసుకుందామని చెప్పి గోదాట్లోకి తోసేశాడు. ఆ సమయంలో ఎవరైనా భయపడిపోయి ప్రాణాలు కోల్పోతారు. కానీ ఓ బాలిక మాత్రం బ్రిడ్జి పైపును పట్టుకుని అరగంట పాటు వేలాడుతూ ప్రాణాలు కాపాడుకుంది. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన పుష్పాల సుహాసిని గొడవలతో భర్తకు దూరంగా ఉంటుంది. కూలి పనులు చేసుకుంటూ కూతురు కీర్తనతో కలిసుంటోంది. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం ప్రకాశం జిల్లా దర్శికి చెందిన ఉలవ సురేష్ తో పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా సహజీవనానికి దారి తీసి.. ఏడాది క్రితం జెర్సీ అనే పాప కూడా పుట్టింది. అయితే ఇటీవల వీరిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి.

పైప్ పట్టుకుని వేలాడుతూ..

దీంతో సుహాసినిని అడ్డుతొలగించాలని డిసైడ్ అయిన సురేష్.. బట్టలు కొందామని నమ్మించి ముగ్గుర్ని రాజమండ్రి తీసుకెళ్లాడు. శనివారం సాయంత్రం ఇంట్లో నుండి తీసుకెళ్లి రాత్రి వరకు ఎక్కడెక్కడో తిప్పి.. ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు రావులపాలెంలోని గౌతమి పాత వంతెన వద్దకు తీసుకెళ్లాడు. సెల్ఫీ తీసుకుందామని అందర్నీ బ్రిడ్జి రెయిలింగ్‌పై నిలబెట్టాడు. సెల్ఫీ అంటూ ఒక్కసారిగా నదిలోకి తోసి అక్కడి నుంచి పరారయ్యాడు. సుహాసిని, జెర్సీ నదిలోకి పడిపోగా.. పెద్ద కూతురు కీర్తన మాత్రం చేతికి చిక్కిన పైప్ పట్టుకొని వేలాడుతూ కాపాడాలంటూ కేకలు వేసింది. కానీ ఆ చీకట్లో పట్టించుకునే వారు లేరు.

తెలివిగా ఆలోచించి పోలీసులకు ఫోన్..

అయినా మనోధైర్యం కోల్పోకుండా తెలివిగా ఆలోచించింది. ఇంతలో ఆమె జేబులో ఉన్న ఫోన్ గుర్తొచ్చింది. వెంటనే ఒక చేత్తో పైప్ పట్టుకొని.. మరో చేత్తో ఫోన్ తీసి 100కు కాల్ చేసింది. కాల్ లిఫ్ట్ చేసిన పోలీసులతో మొత్తం మ్యాటర్ చెప్పేసింది. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి ఆమెని కాపాడారు. ఇలాంటి పరిస్థితిలో కూడా ఆమె చూపించిన ధైర్యానికి పోలీసులు కూడా ఫిదా అయ్యారు. నదిలో పడిన పాప తల్లి, చెల్లి కోసం పోలీసులు వెతుకుతున్నారు. మరోవైపు పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునే ప్రయత్నాలు మొదలెట్టారు. ఆ బాలిక ప్రాణాలు దక్కించుకున్న తీరుపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి