Teeth Tips: పుచ్చిన దంతాలను రిపేర్‌ చేసే టెక్నిక్‌.. కొత్తవాటిలా మెరుస్తాయి

ఎక్కువగా షుగర్‌ ఉన్న ఆహారం తింటే దంతక్షయం వస్తుందని నిపుణులు అంటున్నారు. మంచి ఆహారంతో ఆరోగ్య సమస్యలతో పాటు దంతాల సమస్యలు కూడా తగ్గుతాయి. కొన్ని సూచనలు పాటిస్తే దంతక్షయం నుంచి కాపాడుకోవచ్చు. దంతక్షయం తగ్గించే సూచనలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

Teeth Tips: పుచ్చిన దంతాలను రిపేర్‌ చేసే టెక్నిక్‌.. కొత్తవాటిలా మెరుస్తాయి
New Update

Teeth Tips: చాలా మంది దంత సమస్యలతో బాధపడుతుంటారు. ప్రధానంగా దంతక్షయంతో ఇబ్బంది పడుతుంటారు. దీని కారణంగా దంతాలు పుచ్చిపోవడం జరుగుతుంది. వాటిని పీకేయించాల్సి వస్తుంది కూడా. కొన్ని సూచనలు పాటిస్తే దంతక్షయం నుంచి కాపాడుకోవచ్చు. మంచి ఆహారంతో ఆరోగ్య సమస్యలతో పాటు దంతాల సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. ఎక్కువగా షుగర్‌ ఉన్న ఆహారం తింటే దంతక్షయం వస్తుంది. చ‌క్కెరతో శ‌రీరానికి కాల్షియం స‌రిగా లభించదు. దీనివల్ల పళ్లు పెళుసుల్లా మారిపోతుంటాయి.

publive-image

కాల్షియం ఎక్కువగా లభించే పెరుగు, క్రీమ్‌, పాలు, ఛీజ్‌ను రోజూ తీసుకోవాలి. కూల్‌డ్రింక్స్‌, సోడాలు, ఆల్కహాల్‌ తీసుకోకూడదని నిపుణులు అంటున్నారు. నీళ్లు, ఫ్రూట్ స్మూతీలు, షుగర్‌లెస్‌ టీ తాగవచ్చని చెబుతున్నారు. నీళ్లు బాగా తాగడం వల్ల ఉమ్మి వచ్చి దంతక్షయం ఉండదని చెబుతున్నారు. షుగర్‌లేని చూయింగ్‌గమ్‌లను తింటే దంతక్షయం తగ్గుతుందని వైద్యులు అంటున్నారు. చూయింగ్ గ‌మ్‌లో జైలిటాల్ అనేది సహజసిద్ధమైన స్వీట్‌నర్‌గా పనిచేస్తుంది. ఇది మన నోట్లో బ్యాక్టీరియా పెరగకుండా చేస్తుంది. ఉమ్మి ఎక్కువగా రావడంతో క్రిములు పోతాయి. ఎక్కువ రోజులు ఒకే టూత్‌బ్రష్‌ వాడితే కూడా దంతక్షయం వస్తుంది. 6 నెలలకు ఒకసారి బ్రష్‌ను మార్చాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. నోటికి సరిపోయేలా బ్రష్‌ను ఎంచుకోవాలి. చిన్నవాటినే వాడాలని చెబుతున్నారు.

publive-image

బ్రిజిల్స్ సాప్ట్‌గా ఉండేలా చూసుకోవాలని, ఇలా ఉండటం వల్ల పళ్ల మధ్యలోకి వెళ్లి చెత్త బయటికి పోతుందని అంటున్నారు. బ్రష్‌కి క్యాప్‌ పెడితే బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుందని హెచ్చరిస్తున్నారు. అలాగే బాత్‌రూమ్‌లకు దగ్గరగా బ్రష్‌లను ఉంచితే క్రిములు పేరుకుంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజుకు రెండుసార్లు బ్రష్‌ చేయాలని, మౌత్‌వాష్‌లు వాడాలని చెబుతున్నారు. అప్పుడప్పుడు డెంటిస్ట్‌ల‌తో నోరును శుభ్రం చేయించుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలని, ఎక్కువగా ఫైబర్‌ ఉండే పండ్లు, కూరగాయలను తీసుకోవాలని అంటున్నారు. ఉదయం స్పూన్‌ కొబ్బరినూనెను నోట్లో వేసుకుని పుక్కిలించి ఊసినా దంతక్షయం రాదని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: వంటగ్యాస్‌ తీసుకునేప్పుడు ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#teeth-tips
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe