AP: పోలవరం ప్రాజెక్టుపై అంతర్జాతీయ నిపుణుల స్పెషల్ ఫోకస్..!

ఏలూరు జిల్లా - పోలవరంలో అంతర్జాతీయ జలవనరుల నిపుణుల బృందం పర్యటిస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం నిర్మాణానికి సవాలుగా ఉన్న డయాఫ్రంవాల్‌, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంల సీపేజీ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇతర ప్రతిబంధక సమస్యల అంశాలను పరిశీలిస్తున్నారు.

New Update
AP: పోలవరం ప్రాజెక్టుపై అంతర్జాతీయ నిపుణుల స్పెషల్ ఫోకస్..!

Polavaram Project: ఏలూరు జిల్లా పోలవరంలో అంతర్జాతీయ జలవనరుల నిపుణుల బృందం (Global Experts) పర్యటిస్తోంది. నేటి నుంచి నాలుగు రోజులపాటు పోలవరంలో పర్యటించనున్నారు. ఇంజనీర్లు డేవిడ్‌ బి.పాల్‌ (అమెరికా), రిచర్డ్‌ డోన్నెల్లీ(కెనడా), డియాన్‌ ఫ్రాన్స్‌ డి.సిక్కో(అమెరికా), సీన్‌ హిచ్‌బర్గర్‌(కెనడా) ఈ బృందంలో ఉన్నారు. డ్యాం నిర్వహణ, భద్రత, సివిల్‌ ఇంజనీరింగ్‌, హైడ్రాలిక్‌ నిర్మాణాలు, కట్టడాలకు సంబంధించిన అంశాల్లో మూడు దశాబ్దాల అనుభవం వీరికి ఉంది.

Also Read: దయనీయంగా రైతుల పరిస్థితి.. 250 మంది ఆత్మహత్య..!

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం (ECRF Dam) నిర్మాణానికి సవాలుగా ఉన్న డయాఫ్రంవాల్‌, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంల సీపేజీ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇతర ప్రతిబంధక సమస్యల అంశాలను పరిశీలించనున్నారు. అధికారులను కలిసి ప్రాజక్టుపై వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. అలాగే వివిధ ప్రాజక్టు డాక్యుమెంట్లను పరిశీలించారు. డ్యాం ప్లాన్, జియాలజీ సెన్, తదితర డాక్యుమెంట్లను పనులు జరిగిన తీరు అడిగి పరిశీలిస్తున్నారు.

Also read: ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డిపై మరో ఆరోపణ..!

రెండో రోజు పూర్తిగా ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతాలు, డయాఫ్రం వాల్ విధ్వంసం పరిశీలన, అగాధాలు, అక్కడ భూభౌతిక పరి స్థితుల మార్పునకు చేస్తున్న ప్రయత్నాలు తదితర అంశాలపై నిపుణుల బృందం ఫోకస్ చేయనుంది. తర్వాత రెండు రోజులపాటు ప్రాజక్టు తనిఖీతో పాటు పోలవరం ప్రాజక్ట్ అథారిటీ అధికారులతో చర్చిస్తారు. అలాగే కేంద్ర జలవనరుల సంఘం అధికారులు, సెంట్రల్ సాయిల్, మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ అధికారులతో చర్చిస్తారు. ఈ క్రమంలోనే ప్రాజెక్టు కాంట్రాక్ట్ ఏజెన్సీ అధికారులతో బృందం చర్చలు జరుపనుంది.

Advertisment
తాజా కథనాలు