Amaravati: త్వరగానే సీఆర్డీఏకు, ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం: ఐఐటీ నిపుణులు

AP: అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను ఐఐటీ హైదరాబాద్ నిపుణుల బృందం పరిశీలించింది.భవనాల పటిష్టత, సామర్థ్యం నిర్ధారణకు మరికొంత సమయం పడుతుందని నిపుణులు తెలిపారు. సాధ్యమైనంత త్వరగానే సీఆర్డీఏకు, ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం అని చెప్పారు.

New Update
Amaravati: ఏపీ రాజధాని అమరావతే! ఆరోజు నుంచే పనులు షురూ.. 

Amaravati: ఏపీ రాజధాని అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలు ఐఐటీ హైదరాబాద్ నిపుణుల బృందం పరిశీలించింది. నిర్మాణాల పరిశీలన అనంతరం మీడియాతో మాట్లాడారు ఐఐటీ ప్రొఫెసర్‌లు సుబ్రహ్మణ్యం, మున్వర్ భాషా. భవనాల పటిష్టత, సామర్థ్యం నిర్ధారణకు మరికొంత సమయం పడుతుందని అన్నారు. భవనాల ప్రస్తుత స్థితి, నిలిచి ఉన్న వర్షపు నీటి ప్రభావం, నిర్మాణ సామగ్రి తాజా స్థితి అంచనా వేయాల్సి ఉంటుందని చెప్పారు.

సాంకేతికంగా వాటిని పూర్తిగా పరిశీలించాక ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం అని అన్నారు. ప్రతీ అంశాన్ని కూలంకుషంగా పరిశీలించి తదుపరి నివేదిక ఇస్తామని పేర్కొన్నారు. నిర్మితమైన భవనాల వద్ద టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం అని తెలిపారు. సామాగ్రిని కూడా పరీక్ష చేయాల్సి ఉందని చెప్పారు. నివేదికకు ఎంత కాలం పడుతుందన్నది ఇప్పుడే స్పష్టంగా చెప్పలేం అని అన్నారు. సాధ్యమైనంత త్వరగానే సీఆర్డీఏకు, ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం అని తెలిపారు.

Also Read: వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్

Advertisment
తాజా కథనాలు