TS: మద్యం సేవించి స్కూల్ కు వచ్చిన ఉపాధ్యాయుడు.. విద్యార్థులను దూషించి ఏం చేశాడంటే..?

భద్రాద్రి జిల్లా ఇల్లందులపాడు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు సుధాకర్ మద్యం సేవించి పాఠశాలకు హాజరయ్యాడు. విద్యార్థులను ఇష్టం ఉన్న రీతిలో దూషించడంతో విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. సుధాకర్ ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు.

New Update
TS: మద్యం సేవించి స్కూల్ కు వచ్చిన ఉపాధ్యాయుడు.. విద్యార్థులను దూషించి ఏం చేశాడంటే..?

Telangana: విద్యార్థులను మంచి మార్గంలో నడిపించవలసిన ఉపాధ్యాయుడే మద్యం సేవించి ఉపాధ్యాయ వృత్తికే కలంకాన్ని తెచ్చాడు. తాగిన మత్తులో విద్యార్థులను దూషించి స్థానికుల చేత తరగతి గదిలో బంధింపబడ్డాడు. ఈ సంఘటన ఇల్లందులపాడులో చోటు చేసుకుంది.

Also Read: ఛీఛీ వీడేం పోలీస్.. వెలుగులోకి ఓ గలీజ్ పోలీస్ వ్యవహరం..!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని ఇల్లందులపాడు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న సుధాకర్ ఈరోజు మద్యం సేవించి పాఠశాలకు హాజరయ్యాడు. ఈ పాఠశాలకు ఒకే ఒక ఉపాధ్యాయుడు సుధాకర్. ఐదు తరగతులకు ఒకడే బోధిస్తున్నాడు. ఆ ఒక్కడు కూడా సక్రమంగా హాజరు కాకపోగా హాజరైనా రోజు మద్యం సేవించి రావడం దురదృష్టకరం.

Also Read: ‘కల్కి’ కోసం నా చెప్పులు కూడా అరిగిపోయాయి : నాగ్ అశ్విన్

తరగతి గదిలో విద్యార్థులను ఇష్టం ఉన్న రీతిలో దూషించడంతో విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థి తల్లిదండ్రులతో పాటు కొంతమంది స్థానికులు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుడిని పరిస్థితిని పరిశీలించారు. గదిలో పెట్టి తాళం వేశారు. మద్యం సేవించి పాఠశాలకు హాజరైన ఉపాధ్యాయుడు సుధాకర్ ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు.

Advertisment
తాజా కథనాలు