Human Brain : పెరుగుతున్న మనిషి మెదడు సైజు.. పరిశోధనలో కీలక విషయాలు వెల్లడి

మనిషి మెదడు పరిమాణం పెరుగుతున్నట్లు అమెరికాకు చెందిన పరిశోధకులు చేసిన ఓ అధ్యయనంలో బయటపడింది. 1930లలో పట్టిన వారితో పోలిస్తే.. 1970లలో వారి పుట్టిన మెదడు సైజు 6.6 శాతం పెరుగినట్లు గుర్తించారు.

Human Brain : పెరుగుతున్న మనిషి మెదడు సైజు..  పరిశోధనలో కీలక విషయాలు వెల్లడి
New Update

Increasing Human Brain : మానవ శరీరంలో మెదడు(Brain) అతిముఖ్యమైన అవయవం. దీనివల్లే మనిషి ఆలోచించగలుగుతాడు, అన్ని పనులు చేసుకోగలుగుతాడు. బ్రెయిన్‌ డ్యామెజ్ అయ్యి చనిపోయిన వాళ్లు కూడా ఎందరో ఉన్నారు. అయితే మనిషి మెదడుకు సంబంధించి అమెరికా(America) కు చెందిన పరిశోధకులు చేసిన ఓ అధ్యయనంలో కీలక విషయం బయటపడింది. మెదడు సైజ్‌ క్రమంగా పెరుగుతున్నట్లు తేలింది. కాలిఫోర్నియా యూనివర్సిటీలోని డెవిస్ హెల్త్‌కు చెందిన పరిశోధకులు మానవ మెదడుపై చేసిన అధ్యయనం వివరాలు జామా న్యూరాలజీ అనే జర్నల్‌లో ప్రచూరితమయ్యాయి.

Also Read : రెండో దశకు టైమైంది..నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ

ఈ అధ్యయనం ప్రకారం చూసుకుంటే.. 1930 లలో పట్టిన వారితో పోల్చుకుంటే.. 1970లలో వారి పుట్టిన మెదడు సైజు 6.6 శాతం పెరుగుతున్నట్లు బయటపడింది. 1999 నుంచి 2019 మధ్యకాలంలో 3,226 మంది మెదడును ఎంఆర్‌ఐ స్కాన్ చేసి పరిశోధకులు అధ్యయనం చేశారు. 1930లలో జన్మించిన వారి మెదడు సగటున 1234 మిల్లీలీటర్లు ఉండగా.. 1970లలో పుట్టిన వారి మెదడు 1321 మిల్లీలీటర్లు ఉన్నట్లు గుర్తించారు.

Also Read : మాల్దీవుల్లో తాగునీటి కోరత.. 1500 టన్నుల నీటిని పంపిన చైనా..

అయితే మెదడు నిర్మాణంలో భాగమైన వైట్‌ మ్యాటర్‌, గే మ్యాటర్, హిప్పోక్యాంపస్ సైజు కూడా పెరిగినట్లుగా గుర్తించారు. అయితే మెదడు సైజు పెరగడం(Increased Brain Size) వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు. ముఖ్యంగా వయసు పెరిగే వారిలో మతిమరుపు, చిత్త వైకల్యం లాంటి ముప్పులు తగ్గుతాయని చెబుతున్నారు. అంతేకాదు మెదడు పెరగడం వల్ల మెదడు బాగా అభివృద్ధి చెందుతుందని.. మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుందని వెల్లడించారు.

#telugu-news #america #human-brain #increasing-brain-size
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe