/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/jagan-1-jpg.webp)
Kadapa : ప్రొద్దుటూరు(Proddutur) లో వైసీపీ(YCP) అసమ్మతి నేతల ఆత్మీయ సమావేశంలో ఆసక్తికర అంశాలు చోటుచేసుకున్నాయి. సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించగా.. స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వచ్చే ఎన్నికల్లో మద్ధతు ఇవ్వలేమని, భవిష్యత్తు కార్యచరణను త్వరలో వెల్లడిస్తామన్నారు.
సమావేశంలో టీడీపీ నేతలు..
అయితే ఈ సమావేశంలో టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సోదరుడు రాఘవ రెడ్డి దర్శనమివ్వడం చర్చనీయాంశమైంది. అంతేకాదు ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీ(TDP) లో చేరిన లక్ష్మి రెడ్డి సైతం ఈ కార్యక్రమానికి హాజరు కావడం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ సమావేశం అనంతరం మాజీ ఎమ్మెల్యే నంద్యాల ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి(Nandyala Raghava Reddy) వైసీపీ అసమ్మతి నేతలతో మాట్లాడం ఆసక్తికరంగా మారింది. దీంతో వైసీపీ నేతలంతా మూకుమ్మడిగా టీడీపీలోకి వెళతారా? లేదంటూ టీడీపీకి మద్దతు ఇస్తారా? అనే ఆంశం ప్రొద్దుటూర్ రాజకీయాల్లో హాట్ హాట్ టాపిక్(Hot Topic) గా మారింది. మరోవైపు ప్రజామోదం లేని నేతలను రాబోయే ఎన్నికల్లో నిలబెట్టవద్దని ఆ పార్టీ హై కమాండ్‌కు అసమ్మతి నేతలు హెచ్చరిస్తున్నారు.