కామారెడ్డి జిల్లా ప్రభుత్వ బడిలో పాము కలకలం రేపింది. మాచారెడ్డి మినీ గురుకులం పాఠశాలలో క్లాస్ రూంలో వచ్చి మరి విద్యార్థిని కాటేసింది పాము. వరండాలో కూర్చున్న నాలుగవ తరగతి విద్యార్థిని నిఖితను పాము కాటేయటంతో చికిత్స నిమిత్తం కామారెడ్డి హాస్పిటల్‌కు తరలించారు స్కూల్ ప్రిన్సిపాల్. పాములను చంపుతుండగా వరండాలో మరో నాలుగు పాములు ప్రత్యక్షం అయ్యాయి.. దీంతో విద్యార్థలందరూ భయంతో పరుగులు తీశారు. స్కూల్ లోపలికి వచ్చిన రెండు పాములను స్థానికులు కర్రలతో కొట్టి చంపివేశారు. మినీ గురుకులంలో ఈ ఘటనం చోటుచేసుకోవాటంతో.. విద్యార్థులు క్లాస్ రూంలోకి వెళ్లటానికి భయపడుతున్నారు.
విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళనకు గురయ్యారు. నిఖితను వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి, యాంటీ వీనమ్ ఇంజక్షన్లు చేయించి, మెరుగైన చికిత్స అదిస్తున్నారు. పాము కాటు వల్ల విద్యార్థి కాలు వాచిందని, పెద్దగా ప్రమాదం ఏమి లేదని వైద్యులు చెప్పినట్లు సమచారం.