ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలోనూ క్రూరత్వం పెరిగిపోతుంది. పట్టుమని పదేళ్ల వయసుకూడా లేని బాలలే హత్యలకు పాల్పడుతున్న సంఘనలు సమాజాన్ని కలవరపెడుతున్నాయి. స్కూల్ తదితర ప్రాంతాల్లో స్నేహితులుగా ఉంటూనే చిన్న చిన్న విషయాల్లో గొడవపడి దాడులు చేసుకుంటున్నారు. తెలిసి తెలియని వయసులో ఇగోను తృప్తి పరుచుకునేందుకు విచక్షణ రహితంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ప్రీ ప్రైమరీ చదువుతున్న ఓ పిల్లవాడు తనతో చదువుతున్న స్నేహితుడినే చంపాలనుకున్న భయంకరమైన సంఘటన బిహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
పూర్తిగా చదవండి..స్కూల్లో స్నేహితుడి మెడ కోసిన 1వ తరగతి విద్యార్థి
ఒకటో తరగతి చదువుతున్న ఆరేళ్ల బాలుడు బ్లేడ్ తో తన స్నేహితుడి మెడ కోసిన భయంకరమైన ఘటన బిహార్ రాష్ట్రం దర్భంగా జిల్లాలోని బహేడీ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. చిన్న విషయంలో గొడవ మొదలవగా విచక్షణ కోల్పోయిన విద్యార్థి ఈ దారుణాకి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
Translate this News: