Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు షాక్.. తెలంగాణ, ఏపీలో భారీగా రైళ్లు రద్దు.. వివరాలివే!

దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ లో జరుగుతున్న పనులు కారణంగా పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని దారి మళ్లించి నడుతున్నట్లు తెలిపింది. ఈనెల 18 నుంచి 31 వరకు విశాఖ, మచిలీపట్నం, విజయవాడ, విశాఖ, గుంటూరు, విశాఖ, రైళ్లను పూర్తిగా రద్దు చేశారు.

Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు షాక్.. తెలంగాణ, ఏపీలో భారీగా రైళ్లు రద్దు.. వివరాలివే!
New Update

రైల్వే ప్రయాణికులకు ముఖ్యగమనిక. పలు డివిజన్లలో జరుగుతున్న పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. కొన్ని పూర్తిగా రద్దు చేయగా..మరికొన్నింటిని దారి మళ్లించి నడుపుతున్నట్లు అధికారులు ప్రకటించారు. సూరారెడ్డిపాలం, ఒంగోళఉ, విజయవాడ సెక్షన్లలో మూడో లైన్ నిర్మాణ పనులు జరుగుతుండటం కారణం. దీంతో 24 ఎక్స్ ప్రెస్ రైళ్లను అధికారులు రద్దు చేశారు. ఈనెల 12, 13,15,16,18,19 తేదీల్లో తిరుపతి పూరి ఎక్స్ ప్రెస్ రైలును రద్దు చేసినట్లు తెలిపారు. అలాగే ఈనెల 13,14,15,17,18,20,21 తేదీల్లో పూరి తిరుపతి ఎక్స్ ప్రెస్ రైలును కూడా రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

తిరుపతి, బిలాస్ పూర్ మధ్య రాకపోకలు సాగించే ఎక్స్ ప్రెస్ రైలు ఈనెల 14,17 తేదీల్లో రద్దు చేశారు. బిలాస్ పూర్, తిరుపతి మధ్య రాకపోకలు సాగించే ఎక్స్ ప్రెస్ రైలును ఈనెల 12,16,19 తేదీల్లో రద్దు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. తిరుపతి, విశాఖ మధ్య నడుస్తున్న రైలును 17వ తేదీన విశాఖ, తిరుపతి మధ్య నడుస్తున్నరైలును 18వ తేదీన రద్దు చేసింది. అలాగే విశాఖ, చెన్నై మధ్యరాకపోకలు సాగిస్తున్న రైలును 18న చెన్నై విశాఖ మధ్య తిరుగుతున్న రైలును ఈనెల 12,19 తేదీల్లో రద్దు చేసింది. విశాఖ తిరుపతి మధ్య నడుస్తున్న ఎక్స్ ప్రెస్ రైలును ఈనెల 18న తిరుపతి, విశాఖ ఎక్స్ ప్రెస్ రైలును ఈనెల 12, 19 తేదీల్లో రద్దు చేశారు. విశాఖ పాలమూరు ఎక్స్ ప్రెస్ రైలును ఈనెల 16,17 తేదీల్లో మహబూబ్ నగర్ విశాఖ ల మధ్య నడుస్తున్న ఎక్స్ ప్రెస్ రైలును ఈనెల 17,18 తేదీల్లో రద్దు చేసింది.

కాగా మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించేందుకు భారతీయ రైల్వే పనిచేస్తోందని అధికారులు అంటున్నారు. అందులో భాగంగానే వందే భారత్ సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా 60 మార్గాల్లో ఈ వందే భారత్ రైళ్లు సేవలందిస్తున్నాయి. ఇచ ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయన్న ఫిర్యాదు మినహా ప్రయాణికులకు నుంచి మంచి ఆదరణను ఇవి దక్కించుకున్నాయి.

ఇది కూడా చదవండి: చలికాలంలో కారు లేదా బైక్ మైలేజీని పెంచాలంటే ఈ టిప్స్ ట్రై చేయండి..!!

#trains-cancelled
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి