మెగా బ్రదర్ నాగబాబు ఏకైక కుమార్తె, సినీనటి నిహారిక తన వ్యక్తిగత జీవితం కొన్ని రోజులుగా వార్తల్లో ఉంటోంది. భర్త జొన్నలగడ్డ చైతన్య నుంచి మనస్పర్థలు రావడంతో ఆమె విడాకులు కోరుతున్నారని, ఇద్దరూ వేరు పడ్డారని, విడివిడిగా ఉంటున్నారనే వార్తులు బయటకు వచ్చాయి. అది నిజమే.. ఇప్పుడు విడాకుల కోసం నిహారిక, చైతన్య కోర్టు మెట్లు ఎక్కారు. హైదరాబాద్, కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం నిహారిక కొణిదెల దరఖాస్తు చేశారు. ఆల్రెడీ విడివిడిగా ఉంటున్న నిహారిక, చైతన్యకు చట్టబద్ధంగా విడాకులు రావడం లాంఛనమే అని కోర్టు వర్గాలు చెబుతున్నాయి.
ఇన్‌స్టాలో ఫోటోలు డిలీట్
2020 డిసెంబర్లో నిహారిక, చైతన్యల వివాహం జరిగింది. రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్ కోటలో వీరి వివాహం ఘనంగా చేసుకున్నారు. దానికి కొన్ని నెలల క్రితం ఆగస్టు 13న హైదరాబాద్ సిటీలో నిశ్చితార్థం జరిగింది. నిహారిక పెళ్ళికి మెగా ఫ్యామిలీ అంతా పూల్ ఎంజాయ్ చేశారు. ఇండస్ట్రీ నుంచి కొద్ది మంది అతిథులు కూడా ఆహ్వానించారు. పెళ్లి తర్వాత కొన్ని రోజులు అంతా సవ్యంగా ఉంది. చైతన్యను సినిమా వేడుకలకు నిహారిక తీసుకువచ్చేవారు. తాను నిర్మించిన ఒక చిన్న ఫ్యామిలీ వెబ్ సిరీస్ ఫంక్షన్లో భర్తతో కలిసి సందడి చేశారు. ఇద్దరూ స్పెయిన్ వెళ్లారు. ఇంకా ఫారిన్ టూర్లు వేశారు. ఇంతలోకే ఏమైందో ఏమో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. కారణాలు తెలియదు గానీ చైతన్య ఫోటోలను నిహారిక డిలీట్ చేయడంతో సినిమా ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకులకు కూడా డౌట్ వచ్చి ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది.
అంతా సందడే.. సందడి
అయితే ఇన్‌స్టాలో భర్తలో కలిసి ఉన్న ఫోటోలను నిహారిక డిలీట్ చేసిన తర్వాత ఆయన కనిపించడం మానేశారు. ఇటీవల వరుణ్‌తేజ్, లావణ్యా త్రిపాఠి నిశ్చితార్థం జరిగింది. ఆ వేడుకల్లో చూడా ఎక్కడా చైతన్య జొన్నలగడ్డ కనిపించలేదు. అన్న, వదినతో కలిసి దిగిన ఫోటోను నిహారిక షేర్ చేయగా ఆయన ఎక్కడ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపించాయి. విడాకుల దరఖాస్తు చేయడంతో కుండబద్దలు కొట్టినట్లు అసలు విషయం అధికారికంగా బయటకు వచ్చింది.
మెడిటేషన్ చేస్తున్న చైతన్య
విడాకుల వార్త తర్వాత నిహారికా కొణిదెల ప్రధాన పాత్రలో నటించిన డెడ్ పిక్సల్స్ వెబ్ సిరీస్ విడుదలైయ్యింది. ఆ సిరీస్ ప్రమోషన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలలో పెళ్లి ప్రశ్నలు రాకుండా నిహారికా జాగ్రత్త పడ్డారు. చైతన్య అయితే మీడియా ముందుకు ఇంతవరకు రాలేదు. తను 4 రోజుల క్రితం తాను మహారాష్ట్రలో ఉన్నట్లు ఆయన పోస్ట్ చేశారు. మెడిటేషన్ చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ కూడా హీరో కళ్యాణ్ దేవ్‌తో విడిపోయినట్టు వినిపిస్తోంది. అయితే, ఆ విషయంలో అధికారికంగా ఎటువంటి ప్రకటన అయితే లేదు ఇప్పుడు.