Jammu: ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిది మంది దుర్మరణం

ఉత్తర కశ్మీర్‌ బారాముల్లాలోని బుజ్తలా బొనియార్‌ ప్రాంతం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మినీ బస్సు అదుపుతప్పి 100 మీటర్ల లోయలో పడిపోయింది. 9 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించగా మరో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Jammu: ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిది మంది దుర్మరణం
New Update

Kashmir: జమ్మూకశ్మీర్‌ బరాముల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికుల వాహనం లోయలో పడి ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడగా సహాయక బృందాలు ఆస్పత్రికి తరలించాయి.

బుజ్తలా బొనియార్‌ ప్రాంతం..
ఈ మేరకు ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లాలోని బుజ్తలా బొనియార్‌ ప్రాంతం వద్ద ఈ భయంకరమైన ఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది. గాయపడిన వారిని స్థానికుల సాయంతో పోలీసులు సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ప్రమాదంలో 7 ఏడుగురికి గాయాలు కాగా వారిని బారాముల్లా పట్టణంలోని ప్రభుత్వ వైద్య కళాశాల (జిఎంసి) ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ మినీ బస్సు అదుపుతప్పి 100 మీటర్ల లోయలో పడిపోయినట్లు అధికారులు గుర్తించారు. అలాగే ఈ సమాచారం అందిన వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు పేర్కోన్నారు. కాగా ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలు ఇంకా తెలియరాలేదు.

ఇది కూడా చదవండి : Hyderabad Hit And Run : హైదరాబాద్‌లో మరో హిట్‌ అండ్‌ రన్‌ కేసు

మార్వాన్ లో మరో ప్రమాదం..
అలాగే జమ్మూ ప్రాంతంలోని కిష్త్వార్‌లోని మార్వాన్ ప్రాంతంలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. రహదారి పనుల్లో ఉన్న స్నో కట్టర్‌ మిషన్ ప్రమాదానికి గురికావడంతో ఇద్దరు మృతి చెందారు. బారాముల్లా, కిష్త్వార్‌లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.లక్ష పరిహారం ఇవ్వనున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రకటించారు.

#jammu-and-kashmir #road-acciden #7-peple-died
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe