General Elections 2024 : ఏపీ (AP) లో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీల్లో మద్యం రేట్లను తగ్గించడం కూడా ఒకటి. ఇప్పుడు ఆ దిశగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. కూటమి ప్రభుత్వం (NDA Government) తక్కువ ధరల్లోనే వివిధ రకాల ప్రముఖ బ్రాండ్ల క్వార్టర్ బాటిల్ ధరను రూ. 80 నుంచి రూ. 90 కే విక్రయించాలని భావిస్తోంది.
కొత్త మద్యం పాలసీ (Liquor Policy), ప్రొక్యూర్‌మెంట్ పాలసీపై ఎక్సైజ్ శాఖ కార్యాచరణ చేపట్టింది. కొత్త మద్యం విధానంపై రెండు రోజుల్లో అధికారుల కమిటీలు ప్రభుత్వానికి నివేదికలు సమర్పించబోతున్నాయి. దేశంలోని ఆరు రాష్ట్రాల్లో పర్యటించిన ఎక్సైజ్ శాఖ అధికారులు అక్కడి మద్యం విధానాల్ని అధ్యయనం చేశారు. ప్రముఖ లిక్కర్ కంపెనీలతో చర్చలు జరిపారు.
ఈ క్రమంలోనే అన్ని రకాల ఎంఎన్సీ బ్రాండ్లకు అనుమతులివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలోగా ప్రముఖ బ్రాండ్లు అందుబాటులోకి రాబోతున్నాయి. తక్కువ ధరలో నాణ్యమైన మద్యాన్ని అందించేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ప్రముఖ బ్రాండ్ల క్వార్టర్ బాటిల్ (Quarter Bottle) ధరను 80 నుంచి 90లోపే నిర్ధారించాలని సర్కార్ యోచిస్తోంది.
Also Read: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు!