Rinku Singh : అంతా గంభీర్ వల్లే.. టీ20 ప్రపంచకప్ లో చోటు దక్కకపోవడంపై రింకూ సింగ్‌!

టీ20 ప్రపంచకప్ 2024 జట్టులో చోటు దక్కకపోవడంపై రింకూ సింగ్ స్పందించాడు. ట్రావెల్ రిజర్వ్‌గా సెలక్ట్ అయిన రింకూ అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నా జట్టులో చోటివ్వకపోతే బాధగానే ఉంటుందన్నాడు. ఏం జరిగినా మన మంచికే అనుకుంటా. మరో రెండేళ్లలో మళ్లీ వరల్డ్‌ కప్‌ వస్తుందంటూ చెప్పుకొచ్చాడు.

New Update
Rinku Singh : అంతా గంభీర్ వల్లే.. టీ20 ప్రపంచకప్ లో చోటు దక్కకపోవడంపై రింకూ సింగ్‌!

T20 World Cup 2024 : టీ20 ప్రపంచకప్ 2024 జట్టులో చోటు దక్కకపోవడంపై రింకూ సింగ్ (Rinku Singh) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ట్రావెల్ రిజర్వ్‌గా మాత్రమే ఎంపికైన రింకూ.. అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నా జట్టులో చోటివ్వకపోతే బాధగానే ఉంటుందన్నాడు. అయితే మెగా టోర్నీల్లో మేనేజ్ మెంట్ సరైన జట్టునే ఎంపిక చేస్తుందన్నాడు. 'ఈసారి నన్ను తీసుకోకపోవడానికి కారణం జట్టు కూర్పే అనుకుంటున్నా. మన చేతుల్లో లేని అంశాల గురించి ఆలోచించకూడదు. జట్టు ప్రకటన వచ్చాక నేను కాస్త అప్‌సెట్ అయింది నిజమే. ఏం జరిగినా మన మంచికే అనుకుంటా. కెప్టెన్ రోహిత్ భయ్యా ప్రత్యేకంగా దీని గురించి ఏం చెప్పలేదు. కఠిన శ్రమను చేస్తూ వెళ్లమని మాత్రమే చెప్పాడు. మరో రెండేళ్లలో మళ్లీ వరల్డ్‌ కప్‌ (World Cup) వస్తుంది. ఇప్పుడే కంగారు పడాల్సిన అవసరం లేదు. అత్యుత్తమ ఆటతీరును కొనసాగిస్తూ ఉంటే తప్పకుండా అవకాశం వస్తుందని చెప్పాడు’ అంటూ చెప్పుకొచ్చాడు.

అలాగే కోల్‌కతా ఐపీఎల్ (IPL) టైటిల్‌ను సొంతం చేసుకోవడంపై సంతోషం వ్యక్తం చేశాడు. ఇదంతా తమ జట్టు మెంటార్‌ గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir) వల్లేనని చెప్పాడు. ఈ విజయం గురించి చెప్పాలంటే మాటలు రావడం లేదు. నా కల నెరవేరింది. కేకేఆర్‌తో ఏడేళ్ల నుంచి ప్రయాణం చేస్తున్నా. ఈ క్రెడిట్‌ అంతా గంభీర్‌కే దక్కుతుందన్నాడు.

Also Read : ఉచిత బస్సుపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం?

Advertisment
తాజా కథనాలు