/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-27T113951.388.jpg)
లియో బ్లాక్‌బస్టర్ సక్సెస్ తర్వాత లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం రజనీకాంత్ కూలీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో అందరి దృష్టిని ఆకర్షించి సినిమాపై అంచనాలను పెంచింది. 4 నెలలకు పైగా లోకేష్ కనగరాజ్ కూలి కోసం కథ రాసుకున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. కూలీ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు సత్యరాజ్ , ప్రముఖ నటులు నటించారు.
ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోండగా.. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటిస్తారు.అన్బరీవ్ మాస్టర్స్ ఈ చిత్రానికి ఫైట్ సీక్వెన్స్‌లను రూపొందిస్తున్నారు. జైలర్ హిమాలయ విజయం తర్వాత రజనీకాంత్ ఉత్సాహంగా ఉన్నారు. అదే సమయంలో ఆయన స్పెషల్ అప్పియరెన్స్‌లో నటించిన ఆ సినిమా తర్వాత వచ్చిన లాల్ సలామ్ సినిమా ఆశించిన విజయాన్ని అందించలేదు.
Look test for #Coolie 🔥
On floors from July pic.twitter.com/ENcvEx2BDj— Lokesh Kanagaraj (@Dir_Lokesh) June 26, 2024
కూలీ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ దశలో కూలీ చిత్రానికి సంబంధించి మోడల్ లుక్ ఫోటో షూట్ (టెస్ట్ షూట్) నిర్వహించారు. ఇందులో రజనీకాంత్ తన కొత్త లుక్‌తో అద్దం ముందు నిలబడి ఉన్న చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ తీశారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.