/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/dog-jpg.webp)
అనిమల్ లవర్స్ ఎక్కువుగా క్కుక్కలను పెంచుకోడానికి ఇష్టపడుతుంటారు . వాటికి అన్నీ సౌకర్యాలు కలిపిస్తూ ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. మనుషుల కన్నా..క్కుక్కకు విశ్వాసం ఎక్కువుగా ఉంటుందని మనం చాలా ఘటనలు చూస్తునే ఉన్నాం. తాజాగా, @TheFigen అనే ట్విటర్ యూజర్ ఓ ఎమోషనల్ వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
He thought his owner, who lost weight, was a stranger, but after smelling him, he recognized the owner!
And his happiness! 💓pic.twitter.com/Hfgx22Occp— Figen (@TheFigen_) November 4, 2023
ఆ వీడియోలో ఓ వ్యక్తి బెంచి మీద కూర్చుని ఉన్నాడు. అంతలో వెనుక నుంచి ఓ కుక్క వచ్చి అరవడం మొదలుపెట్టింది. బెంచి మీద కూర్చున్న ఆ వ్యక్తి ఆ కుక్క యజమానే. అయితే చాలా కాలం క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆ వ్యక్తి బాగా బరువు తగ్గి ఇంటికి చేరుకున్నాడు. దీంతో, మొదట తన యజమానిని ఆ కుక్క గుర్తుపట్టలేకపోయింది. ఎవరో అపరిచితుడు అనుకుని మొరిగింది. కానీ, దగ్గరకు వెళ్లి వాసన చూసిన తర్వాత తన యజమానిని గుర్తించింది. వచ్చింది తన యజమానే అని తెలుసుకున్న ఆ కుక్క ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
Also Read: ఏంటీ డీప్‌ఫేక్ వీడియోలు..వీటిని ఎలా తయారు చేస్తారు? నకిలీ, అసలును గుర్తించడం ఎలా?
ఆనందంతో గెంతుతూ అతడి పైకి ఎగిరింది. ఈ ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 43 లక్షల మందికి పైగా వీక్షించారు. ఎంతో మంది లైక్ చేశారు. ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. అద్భుతమైన వీడియో.. నాకు కన్నీళ్లు వచ్చాయి, ఎంతో ఆత్మీయుడిని చూసినట్టు కుక్క సంతోషపడుతోంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.