infection dead: వెంట్రుకలు తొలగించే వారు తస్మాత్ జాగ్రత్త!

మీరు కూడా ఇలా మీ చర్మం నుంచివెంట్రుకలను లాగడం ప్రారంభిస్తే, జాగ్రత్తగా ఉండండి. అమెరికాలో ఒక వ్యక్తి ఇన్గ్రోన్ హెయిర్లను తొలగించడానికి ప్రయత్నించటంతో  ఇన్ఫెక్షన్ సోకి చివరకి అతడు ప్రాణాలను కోల్పోయాడు.

New Update
infection dead: వెంట్రుకలు తొలగించే వారు తస్మాత్ జాగ్రత్త!

టెక్సాస్ నివాసి స్టీవెన్ స్పినెల్ తన కాళ్ళ నుండి పెరిగిన వెంట్రుకలను కొన్నేళ్లుగా తొలగించటం ప్రారంభించాడు.  అప్పుడు ఈ ఇన్ఫెక్షన్ వ్యాపించింది. ఇన్గ్రోన్ హెయిర్‌లు అంటే ఏమిటనే కదా మీరు ఆలోచిస్తుంది? కాబట్టి మీరు శరీరంపై, ముఖ్యంగా చేతులు, కాళ్ళపై చిన్న చిన్న మచ్చలను చూసి ఉంటారు . అవి మీకు  బాధించవు అలాగే పెద్దవిగా కూడా ఎదగవు, చర్మాన్ని నల్లగా కనిపించేలా చేస్తాయి అంతే. స్టీవెన్ స్పినెల్ తన శరీరం నుంచి వెంట్రుకలు తొలగించిన తక్కువ కాలంలోనే తనకు ఇన్ఫెక్షన్ సొకింది. అప్పుడు ఇన్ఫెక్షన్ బాగా వ్యాపించటంతో అతడు కోమాలోకి వెళ్లిపోవటంతో. వైద్యులు అతడిని 'బ్రెయిన్ డెడ్'గా ప్రకటించారు. 

రక్తంలో విషం వ్యాపించింది
.2022లో, నా సోదరుడు ఈ వెంట్రుకలను తొలగించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ఇన్ఫెక్షన్  అతని రక్తంలో  వ్యాపించిందని స్టీవెన్ సోదరి మిచెల్ చెప్పారు. దీంతో శరీరం మొత్తం పాడైపోయింది. అతని అవయవాలు పనిచేయడం మానేసి కోమాలోకి వెళ్లిపోయాడు. దాదాపు మూడు వారాల పాటు కోమాలోనే ఉన్నాడు. వైద్యులు బ్రెయిన్ డెడ్ గా ప్రకటించారు.ఇది ఒక ఇన్ఫెక్షన్, ఇందులో జీవించే అవకాశాలు 4 శాతం మాత్రమే. స్టీవెన్ ప్రాణాలతో బయటపడలేడని వైద్యులు చెబుతున్నారు. అతని మెదడులో ఎలాంటి కార్యకలాపాలు జరగడం లేదు. అయితే అతడిని కాపాడేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు