Ayodhya : అయోధ్య రాములోరికి హైదరాబాద్‌ ముత్యాల హారం!

అయోధ్య రాముల వారికి తెలంగాణ హైదరాబాద్‌ నుంచి ముత్యాల హారం కానుకగా వెళ్తుంది. దీనిని ప్రవళ జ్యువెలర్స్‌ అండ్‌ జేమ్స్‌ వారు తయారు చేసి స్వామి వారికి సమర్పిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ నుంచి స్వామి వారికి బంగారు చీర కానుకగా వెళ్తుంది.

Ayodhya : అయోధ్య రాములోరికి హైదరాబాద్‌ ముత్యాల హారం!
New Update

Ayodhya : అయోధ్యలో(Ayodhya) సోమవారం (జనవరి 22) న రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరగనుంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న తరుణం మరో రెండు రోజుల్లో నెరవేరబోతుంది. ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.

ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా కూడా రామనామ జపంలో మునిగి తేలుతున్నారు. రామమందిర ప్రారంభోత్సవం కార్యక్రమంలో దేశం మొత్తం కూడా పాల్గొనేందుకు సిద్దమైంది. ఈ క్రమంలోనే దేశ నలుమూలల నుంచి కూడా స్వామి వారికి పెద్ద ఎత్తున కానుకలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అయోధ్య రాముల వారికి హైదరాబాద్‌(Hyderabad)  ప్రవళ జ్యువెలర్స్ అండ్‌ జేమ్స్(Pravala Pearls and Gems) వారు మూడు కిలోల 600 గ్రాముల ముత్యాల హారం కానుకగా పంపనుంది.

తొమ్మిది మంది కళాకారులు తొమ్మిదిరోజులు..

ఈ ముత్యాల హారాన్ని తొమ్మిది మంది కళాకారులు తొమ్మిదిరోజులు కష్టపడి తయారు చేశారు. ఈ హారం తయారు చేయడానికి ముంబై నుంచి ముత్యాలను తెప్పించారు. మూడు కిలోల 600 గ్రాముల ముత్యాలు, అరకిలో పచ్చల మణులతో ఈ హారం ప్రవళ జ్యువెలర్స్‌ అండ్‌ జేమ్స్‌ వారు తయారు చేశారు.

ఈ హారంలో అరకిలో పచ్చల మణలు కూడా ఉపయోగించారు. స్వామి వారికి ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కానుకలు భారీగా వెళ్తున్నాయి. తిరుపతి నుంచి శ్రీవారి లడ్డూలు పంపుతుండగా.. ఇప్పటికే సిరిసిల్ల నుంచి స్వామి వారికి బంగారు చీరను పంపుతున్నారు.సిరిసిల్లకు చెందిన నేతన్న హరిప్రసాద్‌ ఈ బంగారు చీరను తయారు చేశారు. రామాయణ ఇతివృత్తాన్ని వర్ణించే చిత్రాలతో చీరను తయారు చేశారు.

Also read: అయోధ్య వేడుకలు పీవీఆర్‌, ఐనాక్స్‌ థియేటర్లలో ప్రత్యక్షప్రసారం..!

#hyderabad #ayodhya #ram-mandir #pearls-haram
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe