పెంపుడు కుక్క బర్త్ డేకు రూ.2.5లక్షల గోల్డ్ చైన్ గిఫ్ట్! ఓ మహిళ తన పెంపుడు కుక్కకు రూ.2.5 లక్షల విలువైన బంగారు గొలుసును బహుమతిగా ఇచ్చిన ఘటన ముంబై లో చోటు చేసుకుంది. సరితా సల్దాన్హా అనే మహిళ తన పెంపుడు కుక్కకు గోల్డ్ చైన్ ను పుట్టినరోజు కానుకగా బహుకరించింది.ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది. By Durga Rao 10 Jul 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి చాలా మందికి తమ పెంపుడు జంతువులు, ముఖ్యంగా కుక్కల పట్ల చాలా ఆప్యాయత ప్రేమ ఉంటుంది. కుక్కలను సొంత పిల్లల్లాగే చూసుకుంటారు. అయితే ఓ మహిళ తన పెంపుడు కుక్కకు రూ.2.5 లక్షల విలువైన బంగారు గొలుసును బహుమతిగా ఇచ్చిన ఘటన ముంబై లో చోటు చేసుకుంది. ముంబైకి చెందిన సరితా సల్దాన్హా అనే మహిళ తన పెంపుడు కుక్కకు పుట్టినరోజు కానుకగా రూ. 2.5 లక్షల విలువైన బంగారు గొలుసును కుక్క మెడలో వేసింది. చెంబూర్‌లోని నగల వ్యాపారి అనిల్ జ్యువెలర్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. “మా కస్టమర్ సరితా సల్దాన్హా తన ప్రియమైన కుక్క టైగర్ పుట్టినరోజును ప్రత్యేకంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకు ఆమె రూ.2.5 లక్షల బంగారు గొలుసును తన పెంపుడు కుక్కలో బహుకరించారని ఆయన ఇన్ స్టాగ్రామ్ లో తెలిపారు.ఇది చూసిన చాలా మంది ఆమె పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. #surprise-gift #trending-video #dog మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి