Bihar : ఓ టెన్త్ విద్యార్థి(10th Class Student) ని పరీక్ష పేపర్లో జవాబుకు బదులు తన బాధను వర్ణిస్తూ రాసిన మ్యాటర్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తమను పాస్(Pass) చేయమని విజ్ఞప్తి చేస్తూ విద్యార్థిని రాతలు చూసి ఇన్విజిలేటర్(Invigilator) ఖంగుతిన్నాడు. తనను ఎలాగైనా పాస్ చేయించాలని, ఫెయిల్ అయితే ఇంట్లో పెళ్లి చేస్తారంటూ ఆవేదనతో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన లెటర్ వైరల్ అవుతుండగా వివరాలు ఇలావున్నాయి.
ఇది కూడా చదవండి : Virat : ఏకైక క్రికెటర్.. కోహ్లీ ఖాతాలో మరో అరుదైన రికార్డు!
నా పరువు కాపాడండి..
బీహార్(Bihar) లో ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షల్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. 'మాది చాలా పేద కుటుంబం. తండ్రి వ్యవసాయం చేస్తాడు. ఆయన రోజు వారీ సంపాదన రూ.400 కూడా ఉండదు. అందుకే తనను ఉన్నత చదువులు చదివించే స్తోమత లేదు. నేను ఈ పరీక్షల్లో ఫెయిల్ అయితే ఖచ్చితంగా నాకు పెళ్లి చేస్తారు. కానీ ఇప్పుడే నాకు పెళ్లి ఇష్టం లేదు. పై చదువులు చదువుకోవాలని ఉంది. దయచేసి తన పరువు కాపాడండి సర్' అంటూ వేడుకుంది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు.