Mancherial : శృంగారం ఆశచూపి యువకుడిని కడతేర్చిన వివాహిత.. ఎడ్లబండిలో తీసుకెళ్లి!

వివాహితతో అక్రమ సంబంధం మోజులో ఓ యువకుడు దారుణంగా ప్రాణాలు కొల్పోయిన ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం కమ్మరిపల్లిలో జరిగింది. మహేందర్ తో కొంతకాలం లేచిపోయి వచ్చిన పద్మ.. మోజు తీరిన తర్వాత భర్త శేఖర్ తో కలిసి ప్రియుడిని హతమార్చింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

New Update
Mancherial : శృంగారం ఆశచూపి యువకుడిని కడతేర్చిన వివాహిత.. ఎడ్లబండిలో తీసుకెళ్లి!

Man Murderd in Chennur: ఓ వివాహితను నమ్మిన పాపానికి యువకుడు దారుణంగా బలయ్యాడు. కట్టుకున్న వాడు కాదంటున్నా వినకుండా పరాయి పురషుడితో అక్రమ సంబంధం (Extra-Marital Affair) నడిపిన ఆమె తన కోరిక తీరిన తర్వాత చివరికి భర్తతో కలిసి అమాయకుడిని పొట్టన పెట్టుకుంది. ఇంట్లో ఎవరూ లేరని, ఏకాంతంగా గడపడానికి ఇదే సరైన సమయమని నమ్మించి దారుణానికి పాల్పడిన ఘటన మంచిర్యాల (Mancherial) జిల్లా చెన్నూర్ మండలం కమ్మరిపల్లిలో జరిగింది.

వివాహేతర సంబంధం..
ఈ మేరకు పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కమ్మరిపల్లికి చెందిన మొగిలి సుగుణక్క-ఓదెలు దంపతులు తమ కూతురు పద్మ (Padma)ను 12 ఏళ్ల క్రితం పొన్నారంవాసి అయిన బట్టె శేఖర్‌  కు ఇచ్చి పెళ్లి చేశారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. అయితే పొన్నారం గ్రామానికి చెందిన రామగిరి మహేందర్‌ (28) అనే యువకుడు హార్వెస్టర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే పద్మతో పరిచయం ఏర్పడింది. కొంతకాలానికి ఇది వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో నాలుగు నెలల క్రితం పద్మ.. మహేందర్‌తో లేచిపోయింది. దీంతో పరువు పోయినట్లు భావించిన శేఖర్.. భార్య తప్పిపోయిందని పోలీసులకు కంప్లైట్ చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నవంబరులో ఆమెను పోలీస్‌స్టేషన్‌కు రప్పించి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు.

భర్త, తల్లిదండ్రులతో కలిసి..
అయితే శేఖర్ తో ఉండటానికి ఇష్టపడని పద్మ మళ్లీ మహేందర్‌తోనే వెళ్లిపోయింది. కొంతకాలాని మహేందర్ తో మనస్పర్థలు రావడంతో కమ్మరిపల్లిలోని తల్లిగారింటికి వచ్చేసింది పద్మ. ఈ క్రమంలోనే మహేందర్‌ తరచూ కమ్మరిపల్లికి వచ్చి పద్మను కలిసేందుకు ప్రయత్నించాడు. దీంతో తనను ఇబ్బందులకు గురిచేస్తున్నాడంటూ ఎలాగైనా మహేందర్ ను వదిలించుకోవాలని పద్మ నిర్ణయించుకుంది. ఈ విషయం భర్తకు చెప్పడంతో భర్త, తల్లిదండ్రులతో కలిసి అతడిని అంతమొందించాలని పథకం వేశారు.

ఇది కూడా చదవండి : Komatireddy Venkat Reddy: కేసీఆర్‌కు హరీష్ రావు వెన్నుపోటు.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఇంట్లో ఎవరూ లేరని పిలిపించి..
ఇందులో భాగంగానే మంగళవారం రాత్రి పద్మ మహేందర్‌కు ఫోన్‌ చేసి ఇంట్లో ఎవరూ లేరు రావాలని కోరింది. దీంతో నమ్మకంగానే కమ్మరిపల్లికి చెందిన కడారి శేఖర్‌, జాలంపల్లి సాయిరాజ్‌లతో కలిసి మహేందర్‌ వచ్చాడు. ఇద్దరిని ఇంటి సమీపంలో ఉంచి పద్మ ఇంట్లోకి వెళ్లగా కంట్లో కారంచల్లి కర్రలతో చితకబాదడంతో మహేందర్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని ఎడ్లబండిలో గ్రామ సమీపంలోని అటవీప్రాంతానికి తీసుకెళ్లి దహనం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

ఎస్సీ, ఎస్టీ కేసు..
మృతుడి వెంట వచ్చిన ఫ్రెండ్స్ సోదరుడు రవీందర్‌కు ఫోన్‌చేసి చెప్పగా పోలీసులకు సమాచారం అందించారు. అటవీప్రాంతానికి వెళ్లి దహనమవుతున్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం చెన్నూరు ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని జైపూరు ఏసీపీ మోహన్‌, సీఐలు రవీందర్‌, మంచిర్యాల డీసీపీ సుధీర్‌ రాంనాథ్‌కేకాన్‌, బన్సీలాల్‌ పరిశీలించారు. నిందితులు పద్మ, శేఖర్‌, మొగిలి ఓదెలు, సుగుణక్కలు పరారయ్యేందుకు ప్రయత్నించగా చెన్నూరులోని బస్టాండ్‌లో పట్టుకుని రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ సుధీర్‌ రాంనాథ్‌ కేకాన్‌ వెల్లడించారు. రవీందర్‌ ఫిర్యాదు మేరకు నిందితులపై హత్యానేరం, ఎస్సీ, ఎస్టీ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు