ఏపీలో కలకలం..పోలీస్ స్టేషన్ ఎదుటే నిప్పంటించుకున్న వ్యక్తి.!

తిరుపతిలో ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ ఎదుటే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అతడి భార్య వేరే అతనితో సహజీవనం చేస్తోంది. వీరికి సహకరించిన కానిస్టేబుల్ శ్రీనివాసును మణికంఠ వెళ్లి ప్రశ్నించగా దొంగకేసు పెట్టి లోపలేస్తానని బెదిరించాడు. దీంతో, మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేశాడు.

ఏపీలో కలకలం..పోలీస్ స్టేషన్ ఎదుటే నిప్పంటించుకున్న వ్యక్తి.!
New Update

తిరుపతి జిల్లా చంద్రగిరిలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఘటన కలకలం సృష్టించింది. విజయవాడకు చెందిన మణికంఠ తమిళనాడు రాష్ట్రం తిరుత్తణికి చెందిన దుర్గ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి 8 ఏళ్ల కుమార్తె, 5 ఏళ్ల అభయ్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. విజయవాడ నుంచి బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్ లో స్థిరపడ్డారు.

Also Read: కదిరిలో రెచ్చిపోయిన అధికార పార్టీ నాయకులు.!

అయితే, మూడు నెలలు క్రితం భర్తతో విభేదించిన భార్య దుర్గా తిరుపతికి చేరుకుంది. భాకరాపేట చెందిన సోను అలియాస్ బాషా అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో, మణికంఠ భార్య దుర్గా, బాషా భాకరాపేటలో మకాం పెట్టారు. ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారు. అయితే, ఈ ఇద్దరికి చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహించే పగడాల శ్రీనివాసులు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం తెలుసుకున్న భర్త మణికంఠ చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడు. కానిస్టేబుల్ శ్రీనువాసులను గట్టిగా నిలదీశాడు. అయితే, తప్పును సరిచేయాల్సిన కానిస్టేబుల్.. మణికంఠను బెదిరించినట్లు తెలుస్తోంది. భార్యను వదిలేసి వెళ్లిపోవాలని.. లేకుంటే దొంగతనం కేసు పెట్టి లోపలేస్తానని వార్నింగ్ ఇచ్చారని సమాచారం.

Also read: విశాఖ ఫిషింగ్ హార్బర్ ఘటనపై మంత్రి అప్పలరాజు రియాక్షన్‌ ఇదే.!

మనస్తాపం చెందిన మణికంఠ స్ధానికంగా ఉండే పెట్రోల్ బంక్ నుంచి 5 లీటర్లు తీసుకొని ఒంటిపై పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. మంటలతో అలాగే స్టేషన్ లోకి వెళ్లి ఆర్తనాదాలు చేశాడు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు, స్థానికులు మంటలను ఆర్పారు. అందుబాటులో 108 అంబులెన్స్ లేకపోవడంతో పశు వైద్య సంచార వాహనంలో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కాగా, కానిస్టేబుల్ తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పును అరికట్టాల్సిన పోలీసులే ఇలా తప్పు చేయడానికి సహకరిస్తే ఎలా అంటూ మండిపడుతున్నారు.

#andhra-pradesh
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe