60 బీర్లు ఒకేసారి తాగిన యువకుడు.. ఆ రిజల్ట్ చూసి షాకైన డాక్టర్లు

స్కాట్లాండ్‌కు చెందిన 37 ఏళ్ల వ్యక్తి ఏకధాటిగా 34 లీటర్లు దాదాపు 60 బీర్లు ఒకేసారి తాగేశాడు. దీంతో ఆరు నెలల పాటు హ్యాంగోవర్ తగ్గకపోవడంతో చివరకు వైద్యులను సంప్రదించగా ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఆ యువకుడిని ‘లాంగ్‌గెస్ట్ హ్యాంగోవర్’గా డాక్టర్లు పేర్కొనడం విశేషం.

60 బీర్లు ఒకేసారి తాగిన యువకుడు.. ఆ రిజల్ట్ చూసి షాకైన డాక్టర్లు
New Update

అధిక మోతాదులో మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. అయినా మందుబాబులు మాత్రం కిక్కు ఎక్కేవరకూ తాగకుండా ఉండలేరు. ఆల్కహాల్ వల్ల అనేక రోగాలు వస్తున్నాయని డాక్టర్లు ఎంత మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోవట్లేదు. సెలవు దినాల్లోనే కాదు ప్రతిరోజు సాయంత్రం అయిందంటే చాలు బార్లు, వైన్స్ పర్మిట్ రూముల్లో మందుబాబుల జాతర సాగుతోంది. బాటిళ్ల మీద బాటిల్లు లాగేస్తున్నారు. అయితే ఓ యువకుడు ఏకంగా ఒకేసారి 60 బీర్లు తాగిన ఆశ్యర్యకరమైన సంఘటన స్కాట్లాండ్‌లో చోటుచేసుకుంది. సాధారణంగా ఆల్కహాల్ తీసుకున్న తర్వాత హ్యాంగోవర్ రావడం కామన్. కొంతమందికి అది కొన్ని గంటల్లో తగ్గిపోతే మరికొంతమందికి ఒక రోజు పడుతుంది. కానీ ఆ యువకుడు ఆరునెలలపాటు హ్యాంగోవర్ లోనే ఉన్నాడు.

పూర్తి వివరాల్లోకి వస్తే.. స్కాట్లాండ్‌కు చెందిన 37 ఏళ్ల వ్యక్తి ఒకసారి ఏకధాటిగా 34 లీటర్లు దాదాపు 60 బీర్లు తాగేశాడు. అయితే సరిపడా తాగినందుకు మనోడూ ఆ రోజుకు హ్యాపీగా ఫీల్ అయినా ఆ తర్వాత రోజు నుంచి కష్టాలు మొదలయ్యాయి. గతంలో ఏ అనారోగ్య సమస్యలేకుండా, ఒక్క ట్యాబ్లెట్‌ వేసుకోని యువకుడిపై ఒక్కసారిగా రోగాలన్నీ దాడి చేశాయి. బద్ధకం, తలనొప్పి, అస్పష్టమైన కంటి చూపుతో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లాడు. పరీక్షించిన వైద్యులు అతనికి సిటీ స్కాన్‌, ఉష్ణోగ్రత, రక్తపోటు అన్ని పరీక్షలు చేశారు. అయితే అతనికి ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయో మొదట్లో డాక్టర్లకు కూడా అర్థంకాలేదు. సీటీ స్కాన్ చేయగా, ఫలితాలు చూసి డాక్టర్లు ఆశ్చర్యపోయారు.

Also read : నిన్ను చూస్తుంటే సిగ్గుగా అనిపిస్తుంది.. మన్సూర్‌ ను పొట్టు పొట్టు తిట్టిన ఖుష్బూ

అతని మెదడు చుట్టూ ఉన్న వింత ఒత్తిడిని వారు గమనించారు. రక్త పరీక్షలో అతను లూపస్ యాంటీకోగ్యులెంట్ సిండ్రోమ్ అనే అరుదైన ఆటో-ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నాడని తేలింది. అతని శరీరంలోని ప్రతిరోధకాలు ఆరోగ్యకరమైన కణాలపై దాడి చేశాయి. అందువల్లనే ఈ వ్యాధి వచ్చినట్లు గుర్తించారు. అలాగే అతని రక్తాన్ని పరీక్షించగా బాడీలో లూపస్ యాంటీకోగ్యులెంట్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని తేలడంతో అతని జీవనశైలి గురించి వైద్యులు ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. ఒకరోజు అనుకోకుండా తాను 60 పింట్స్ అంటే దాదాపు 28 లీటర్ల బీరు తాగానని, ఆ తర్వాత హ్యాంగోవర్ తగ్గకపోవడంతో అదేపనిగా మరిన్ని తాగినట్లు తెలిపాడు. దీంతో అధికంగా బీర్ తాగడం వల్లనే అతని హ్యాంగోవర్ సుమారు 4 వారాల వరకు తగ్గలేదని వైద్యులు నిర్ధారించారు. ఆ తర్వాత కూడా తలనొప్పి, అస్పష్టమైన కంటి చూపు ఆరు నెలల పాటు కొనసాగింది. కొన్ని నెలల వైద్యం తర్వాత ఎట్టకేలకు కోలుకోగా అతన్ని ‘లాంగ్‌గెస్ట్ హ్యాంగోవర్’గా డాక్టర్లు పేర్కొనడం విశేషం. కాగా ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. అతడు చేసిన పనికి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

#scotland-man #drank #60-beers
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe