Crime: భార్య, కూతుళ్లను గొడ్డలితో నరికిన వ్యక్తి.. ఆ తర్వాత ఏం చేశాడంటే!

మహారాష్ట్రలో ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు కుమార్తెలను గొడ్డలితో నరికి చంపాడు. అంబాదాస్ తల్మలే అనే ఇంటి పెద్ద భార్య అల్కా, కూతుళ్లు ప్రణాలి, తేజస్వినిలను హతమార్చి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Crime: భార్య, కూతుళ్లను గొడ్డలితో నరికిన వ్యక్తి.. ఆ తర్వాత ఏం చేశాడంటే!
New Update

Crime: మహారాష్ట్రలో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. కట్టుకున్న భార్య, కన్న పిల్లల పట్ల క్రూర మృగంలా వ్యవహరించాడు. క్షణికావేశంలో విచక్షణ కోల్పోయిన ఇంటి పెద్ద ముగ్గురిపై కసాయి వాడిలా దాడి చేశాడు. అమ్మను కొట్టొద్దని అడ్డొచ్చిన పెద్ద కూతురును జాలీ లేకుండా చితకబాదాడు. తండ్రి దారుణాన్ని గమనించి అడ్డుకునేందుకు వచ్చిన చిన్న కూమార్తెను సైతం వదలకుండా ఒకరి తర్వాత ఒకరిని గొడ్డలితో నరికి చంపిన ఘటన చంద్రపూర్ లో సంచలనం రేపింది.

ఇది కూడా చదవండి : Gavaskar: మేము తోపులం అనుకునేవారికి ఇదొక హెచ్చరిక.. గావస్కర్ షాకింగ్ కామెంట్స్!

ఈ మేరకు చంద్రాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు కుమార్తెలను గొడ్డలితో నరికి చంపి అనంతరం ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు. నాగ్‌భిడ్‌ గ్రామానికి చెందిన అంబాదాస్ తల్మలే క్షణికావేశంలో తన కుమార్తెలు ప్రణాలి(19), తేజస్విని(20), భార్య అల్కా(40)పై గొడ్డలితో దాడి చేసి హతమార్చాడు. అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు అడ్డుకుని అతడిని పోలీసులకు అప్పగించారు. ఆర్థికపరమైన కలహాలే ఈ ఘటనకు కారణమని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

#a-man-attacked #wife-and-two-daughters
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe