Odisha: యువతి తలకు 70 సూదులు గుచ్చిన మాంత్రికుడు.. చివరికీ ఏమైదంటే!

ఆరోగ్యం బాగుచేస్తానని నమ్మించి ఓ మాంత్రికుడు రేష్మా బెహరా అనే యువతి తలకు 70 సూదులు గుచ్చిన ఘటన ఒడిశాలో జరిగింది. గంటన్నరపాటు శ్రమించి ఆమె తలలోని సూదులను వైద్యులు బయటికి తీశారు. మాంత్రికుడు తేజ్‌రాజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

New Update
Odisha: యువతి తలకు 70 సూదులు గుచ్చిన మాంత్రికుడు.. చివరికీ ఏమైదంటే!

Crime: ఒడిశాలోని బొలంగీర్ జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న యువతికి ఓ మాంత్రికుడు ఊహించని షాక్ ఇచ్చాడు. ఆరోగ్యం బాగుచేస్తానని చెప్పి ఆమె తలలోకి 70 సూదులు గుచ్చాడు. బుర్లాలోని వింసార్‌ ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స చేసి వాటిని బయటకు తీయగా ఇందుక సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ మేరకు సింథికేలా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఇచ్‌గావ్‌ గ్రామానికి చెందిన రేష్మా బెహరా(19) మూడేళ్ల క్రితం అనారోగ్యం బారినపడింది. దీంతో ఆమె తండ్రి బిష్ణు బెహరా.. తేజ్‌రాజ్‌ రాణా అనే మాంత్రికుడి దగ్గరకు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే రేష్మా తలలోకి 70 సూదులను గుచ్చాడు. దీంతో తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న యువతిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా వైద్యులు నిర్ఘాంతపోయారు. పుర్రెపై సూదులు ఉన్నట్లు గుర్తిం దాదాపు గంటన్నరపాటు శ్రమించి యువతి తలలోని 70 సూదులను బయటికి తీశారు. ఆమె ప్రాణాలతో బయటపడగా మాంత్రికుడు తేజ్‌రాజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Advertisment
తాజా కథనాలు