Lemon Auction: రూ.35 వేలు పలికిన నిమ్మకాయ.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు!

తమిళనాడులో ఓ నిమ్మకాయ ధర రూ.35 వేలు పలకడం చర్చనీయాంశమైంది. శివరాత్రినాడు శివుడికి నైవేద్యంగా సమర్పించిన పలు వస్తువులను శివగిరి గ్రామం ఆలయ కమిటీ వేలం వేసింది. 15మంది నిమ్మకాయకోసమే పోటీపడటం విశేషం. దీనిని దక్కించుకుంటే ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తుందని స్థానికుల విశ్వాసం.

New Update
Lemon Auction: రూ.35 వేలు పలికిన నిమ్మకాయ.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు!

Lemon: వేసవి కాలంలో నిమ్మకాయలకు భారీ డిమాండ్ ఉంటుంది. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు లెమన్ తో తయారు చేసిన రకరకాల సోడాలు, పానీయాలు సేవిస్తుంటారు జనాలు. దీంతో సాధారణంగా మూడు, నాలుగు రూపాయలు పలికే నిమ్మకాయ ఒక్కోసారి రూ.10లు దాటుతుంది. దీంతో నిమ్మకాయ కొనాలంటే పలికితే జనాలు బెంబేలెత్తిపోతారు. అయితే తమిళనాడులో ఓ నిమ్మకాయ రూ.35 వేలు ధర పలకడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

శివుడికి నైవేద్యంగా..
ఈ మేరకు పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడు (Tamil Nadu)లో నిర్వహించిన వేలం (Lemon Auction)లో నిమ్మకాయ భారీ ధర పలికింది. ఈరోడ్‌ జిల్లా శివగిరి గ్రామం సమీపాన ఉన్న ఓ ఆలయంలో నిర్వహించిన వేలంలో ఈ ధరకు నిమ్మకాయను ఓ వ్యక్తి కొనుగోలు చేశారు. ఆ ఆలయంలో ఇటీవల మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వేడుకలను నిర్వహించారు. ప్రత్యేక పూజల సందర్భంగా ఆనవాయితీ ప్రకారం నిమ్మ, ఇతర ఫలాలు, సామగ్రిని శివుడికి నైవేద్యంగా సమర్పించారు.

ఇది కూడా చదవండి: Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభం.. వారికే ఇస్తామన్న రేవంత్!

వేలంలో 15 మంది పోటీ..
అయితే పూజల అనంతరం ఆ సామగ్రిని వేలం వేశారు. ఈ వేలంలో మొత్తం 15 మంది పాల్గొన్నగా.. ఈరోడ్‌కు చెందిన ఓ భక్తుడు రూ.35 వేలకు నిమ్మకాయను దక్కించుకున్నాడు. దీన్ని దక్కించుకున్నవారికి ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తుందని స్థానికుల విశ్వాసం. కాగా వందలాది భక్తుల సమక్షంలో పూజలు నిర్వహించిన అనంతరం అతడికి అందజేసినట్లు ఆలయ కమిటీ వెల్లడించింది. ఇదిలావుంటే.. ఇటీవల బ్రిటన్‌ కళాఖండాల వేలంలో 285 ఏళ్ల నాటి ఒక నిమ్మకాయ ఏకంగా రూ.1.45 లక్షలు రికార్డు ధరకు అమ్ముడుపోయింది. ఓ డాక్యుమెంటరీ చిత్రీకరణ సమయంలో బ్రిటిష్ ఫోటోగ్రాఫర్ దీనిని కనుగొన్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు