King cobra: బాబోయ్‌ ఇంట్లోకి కింగ్ కోబ్రా.. తర్వాత ఏం జరిగిందంటే?

అనకాపల్లి జిల్లా కోడూరు సమీపంలో యలమంచిలి రమేశ్‌ ఇంట్లోకి కింగ్‌కోబ్రా దూరింది. దాదాపు 13 అడుగులున్న ఈ పామును స్నేక్‌ క్యాచర్‌ వెంకటేశ్‌ పట్టుకున్నాడు. తర్వాత దట్టమైన అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. కింగ్ కోబ్రాలో కనీసం 11 మంది మానవులను లేదా ఓ పెద్ద ఏనుగును చంపేంత విషం ఉంది. కింగ్ కోబ్రా కాటులో అధిక స్థాయిలో విషపదార్థాలు ఉండటమే కాదు.. ఈ పాయిజన్ మీ గుండె, ఊపిరితిత్తులను లక్ష్యంగా చేసుకుంటాయి.

New Update
King cobra: బాబోయ్‌ ఇంట్లోకి కింగ్ కోబ్రా.. తర్వాత ఏం జరిగిందంటే?

King cobra enters home: ఇంట్లో అందరూ తమ పనుల్లో బిజీగా ఉండిపోయారు. ఇంతలోనే ఒక గదిలో ఏదో కదులుతున్నట్టు అనిపించింది.. టక్కున చూస్తే పెద్ద పాము..అది కూడా కింగ్‌ కోబ్రా.. 13అడుగుల వరకు ఉంటుంది.. ప్రాణం పోయినంతా భయం వేసింది. అడుగు వేయలేకపోయారు. ఆ పాము ఏం చేస్తుందోనని ఫుల్‌గా టెన్షన్ పడ్డారు. పక్కనే ఉన్న మొబైల్ తీసుకున్నారు. స్నేక్‌ క్యాచర్‌కి కాల్ చేసి సైలెంట్‌గా ఇంటి నుంచి బయటపడ్డారు. తర్వాత ఏం జరిగింది?

publive-image పామును పట్టుకుంటున్న స్నేక్ క్యాచర్ వెంకటేశ్

హమ్మయ్య సేఫ్‌:
అనకాపల్లి జిల్లా(Anakapalli district) కోడూరు(Koduru) సమీపంలో యలమంచిలి రమేశ్‌ అనే వ్యక్తి ఇంట్లోకి వచ్చిన కింగ్‌ కొబ్రా(king cobra) వచ్చింది. భయాందోళనకు గురైన రమేశ్‌ స్నేక్ క్యాచర్‌(Snake catcher)కు సమాచారం ఇచ్చాడు. దీంతో అక్కడికి చేరుకున్న స్నేక్‌ క్యాచర్‌ ఆ పామును చాకచక్యంగా పట్టుకున్నాడు.

Also Read: ఇద్దరమ్మాయిలు సూసైడ్‌.. ప్రాణం తీసిన మార్ఫింగ్‌ ఫొటోలు
దాదాపు 13 అడుగుల కింగ్ కొబ్రాను స్నేక్‌ క్యాచర్‌ వెంకటేశ్‌ పట్టుకున్నాడు. ఆ తర్వాత పామును దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలి పెట్టారు. అంత పెద్ద పాము ఏం చేస్తుందోనని భయపడ్డ స్థానికులు స్నేక్‌ క్యాచర్‌ వచ్చి దాన్ని కంట్రోల్ చేయడంతో ఊపిరిపీల్చుకున్నారు.

చాలా డేంజర్ బాసూ!
కింగ్ కోబ్రాస్ ప్రపంచంలోనే అతి పొడవైన విషపూరిత పాము. ఈ పాము దాదాపు 20 అడుగుల పొడవును చేరుకోవడమే కాకుండా , కింగ్ కోబ్రాలో కనీసం 11 మంది మానవులను లేదా ఓ పెద్ద ఏనుగును చంపేంత విషం(poison) ఉంది. కేవలం ఒక కాటుతో ప్రాణాలే పోతాయ్. కింగ్ కోబ్రా కాటులో 400-500 mg విషం ఉంటుంది . ఒక ఎలుకను చంపడానికి అవసరమైన విషం సగటు పరిమాణం 1 mg మాత్రమే. దీనిబట్టే మీరు అర్థం చేసుకోవచ్చు కింగ్‌ కోబ్రాలు ఎంతటి విషపూరితమైనదో. కింగ్ కోబ్రా తరచుగా పక్షులు , బల్లులు, ఇతర పాములను వేటాడి తింటాయి . ఎలుకలు వాటి మొదటి ఎంపిక కానప్పటికీ, అవి అప్పుడప్పుడు ఎలుకలను వెంటాడుతాయి.

కింగ్ కోబ్రా చెట్లు ఎక్కగలదు. అంటే అవి తరచూ వివిధ రకాల పక్షులను గుర్తించే పరిధిలో ఉంటాయి. కింగ్ కోబ్రా గంటకు 12 మైళ్ల వరకు కదులుతుంది. ఈ పాము పెద్ద కొండచిలువలు మినహా ఇతర పాములపై ​​చాలా ఆధిపత్యం చెలాయిస్తుంది. కింగ్ కోబ్రా మలబార్ పిట్ వైపర్, హంప్-నోస్డ్ పిట్ వైపర్‌లను కూడా వేటాడవచ్చు. ఈ పాములు తరచుగా జనావాస ప్రాంతాలలో కనిపిస్తాయి. కింగ్ కోబ్రా కాటుకు తప్పనిసరిగా యాంటీవీనమ్‌తో చికిత్స చేయాలి. కింగ్ కోబ్రా కాటులో అధిక స్థాయిలో విషపదార్థాలు ఉండటమే కాదు.. ఈ విషం మీ గుండె, ఊపిరితిత్తులను లక్ష్యంగా చేసుకుంటాయి. కాటు వెంటనే చికిత్స తీసుకోకపోతే చాలా మంది బాధితులు కార్డియాక్ అరెస్ట్ లేదా శ్వాసకోశ సమస్యలతో చనిపోతారు.

ALSO READ: రెండు రోజులు బాదుడే బాదుడు.. తెలుగు రాష్ట్రాలపై వరుణుడు పంజా

Advertisment
Advertisment
తాజా కథనాలు