Viral Video : కేజీ చద్దన్నం రూ.1000 అంట.. వైరల్ అవుతున్న వీడియో!

అమెరికాలో చద్దన్నంకు భారీ క్రేజ్ ఏర్పడింది. చద్దన్నం తినేందుకు నామోషీగా ఫీల్ అయినవారు..ఇందులోని పోషక విలువలు తెలుసుకున్నాక చద్దన్నం తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అమెరికాలోనిఓ స్టోర్ లో చద్దన్నం వెయ్యిరూపాయలకు అమ్ముడవుతుందట.

Viral Video : కేజీ చద్దన్నం రూ.1000 అంట.. వైరల్ అవుతున్న వీడియో!
New Update

Chaddannam : ఒక్కసారి చద్దన్నం(Chaddannam) తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో(Health Benefits) తెలసుకున్నారంటే వద్దన్నా చద్దన్నం తింటాం అంటారు. రాత్రి మిగిలిన అన్నాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో పొద్దున తినడం మాత్రమే కాదు..రాత్రికి అన్నం మిగిలేలా చేసి అన్నం వండుకుని మరీ తింటారు. ఇమ్యూనిటీని పెంపొందించడంలో చద్దన్నంకు మించిన సూపర్ ఫుడ్(Super Food) మరొకటి లేదు. అందుకే మన దేశంలోనే కాదు విదేశాల్లోనూ ఈ పల్లెటూరి చద్దన్నంకు సూపర్ క్రేజ్ ఏర్పడింది. అక్కడ డబ్బులిచ్చి మీర చద్దన్నంను కొంటున్నారు. ఫైవ్ స్టార్ హోటల్స్ లోనూ చద్దన్నంను ప్రత్యేకంగా వడ్డిస్తున్నారు. ఆన్ లైన్ ఆర్డర్స్(Online Orders) లోనూ చద్దన్నం స్పెషల్ మెనూలో చేరింది.

రాత్రన్నం తినేందుకు ఒక్కప్పుడు నామోషీగా ఫీల్ అయ్యేవారు..ఇప్పుడు అందులోని పోషక విలువలను తెలుసుకుని చద్దన్నం తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అమెరికాలో చద్దన్నంను భారీ ధరకు అమ్ముతున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అమెరికా(America)లోని ఓ స్టోర్ లో చద్దన్నంను దాదాపు Rs. 1000/- వెయ్యి రూపాయలకు అమ్ముతున్నారు. ఓ ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ ఆ వీడియోను సోషల్ మీడియా(Social Media) లో షేర్ చేసింది. ఈ వీడియో ఇప్పటికే 4.2 మిలియన్ల వ్యూస్ తో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. దీంతో మరోసారి చద్దన్నంపై చర్చ జోరుగాసాగుతోంది.

చద్దన్నంలో ఉండే పోషకవిలువలు ఇవే:
-చద్దన్నంలో ఐరన్, కాల్షియం, పొటాషియం అధికమోతాదులో ఉంటుంది.
-అల్సర్లు, పేగు సంబంధ సమస్యలు ఉన్నవారికి చద్దన్నం ఔషధంలా పనిచేస్తుంది.
-యాంగ్జయిటీని దూరం చేస్తుంది.
-ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది.
-ఉదయాన్నే చద్దన్నంలో పెరుగు కలుపుకుని తింటే రక్తహీనత తగ్గుతుంది.
-చద్దన్నం తింటే రక్తపోటు, మలబద్దకం సమస్యలు దూరం అవుతాయి.
-ఎదిగే పిల్లలకు చద్దన్నం మంచి పౌష్టికాహారం
-తరచూ చద్దన్నం తింటే బద్దకం, నీరసం దరిచేరవు.

చద్దన్నం ఎలా చేయాలంటే?
రాత్రి మిగిలిపోయిన అన్నంను మట్టిపాత్రలో ఉండలు లేకుండా ఉంచాలి. అందులో అన్నం మునిగేంత వరకు నీళ్లు పోయాలి. ఆ తర్వాత గోరువెచ్చని పాలు , పెరుగు నాలుగైదు పచ్చిమిర్చి కొంచెం ఉప్పు వేసి కలియబెట్టాలి. మూతపెట్టి రాత్రంతా కదిలించకుండా ఉంచాలి. పెరుగు పులియడం వల్ల ఆరోగ్యానికి మేలు చేసే ప్రొబ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. మరుసటి రోజు అన్నంలో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని తింటే రుచిగా ఉండటంతోపాటు శరీరానికి ఎంతో శక్తి వస్తుంది.

ఇది కూడా చదవండి: అదానీ-హిండెన్‌బర్గ్ కేసుపై సుప్రీంకోర్టు నేడు తీర్పు..షేర్లపై ప్రభావం చూపనుందా?

#viral-video #usa #health-tips #chaddannam #intresting-things
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe