అగ్ని సాక్షిగా పెళ్లాడిన భార్య మనసులో తనకు స్థానం లేదని తెలిసిపోయింది. పేరుకు మాత్రమే తనకు భార్యగా ఉంటుందని అర్ధమయ్యింది. తనకు, సమాజానికి భయపడి తనతో కలిసి ఉంటున్న బలహీన బంధాన్ని వివాహ బంధంగా అంగీకరించలేక పోయాడు.
పోలీసుల చొరవతోగడప దాటిన భార్యను ఆమెకు మనసైన ప్రియుడితోనే పెళ్లి చేశాడో వ్యక్తి. ఈ అరుదైన సంఘటన ఒడిశాలోని సోన్ పూర్ జిల్లా శుభలాయి ఠాణా పరిధిలోని కిరాసి గ్రామానికి చెందిన మాధవ ప్రధాన్ మూడేళ్ల క్రితం అనుగుల్ ప్రాంతానికి చెందిన జిల్లిని పెళ్లి చేసుకున్నాడు.
ఇటీవల జిల్లి దూరపు బంధువైన పరమేశ్వర ప్రధాన్ తో సన్నిహితంగా ఉంటోంది. గురువారం అతనితో కలిసి ఇల్లువదిలి వెళ్లిపోయారు.దీనిపై మాధవ ప్రధాన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలించి ఇద్దరిని ఠాణాకు తీసుకొచ్చారు.
జిల్లిని ఠాణా అధికారి ప్రశ్నించగా పరమేశ్వర్ ప్రధాన్ తో ఉంటానని అతడినే పెళ్లిచేసుకుంటానని చెప్పడంతో విషయం మాధవ ప్రధాన్ కు వివరించారు. మాధవ అంగీకారంతో ఆయన సమక్షంలోనే శనివారం రాత్రి పరమేశ్వర ప్రధాన్ తో జిల్లికి పెళ్లి ఠాణాలో వివాహం జరిపించారు.